ETV Bharat / state

తెలంగాణకు అస్థిత్వమే కాదు - ఆస్తులు కూడా సృష్టించాం : కేటీఆర్‌

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 24, 2023, 12:17 PM IST

Updated : Dec 24, 2023, 3:03 PM IST

BRS Presentation On KCR Govt Ruling 2014-23 : రాష్ట్రంలో బీఆర్ఎస్​ తొమ్మిదిన్నరేళ్ల పాలనపై తెలంగాణ భవన్​లో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పవర్​ పాయింట్‌ ప్రజంటేషన్​ ఇచ్చారు. కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీలో తమపై బురద జల్లే ప్రయత్నం చేసిందని, ప్రజలకు అసలైన నిజాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే 'స్వేదపత్రం' విడుదల చేశామని స్పష్టం చేశారు.

BRS Powerpoint Presentation at Telangana Bhavan
KTR Power Point Presentation at Telangana Bhavan

తెలంగాణకు అస్థిత్వమే కాదు - ఆస్తులు కూడా సృష్టించాం కేటీఆర్‌

BRS Presentation On KCR Govt Rule 2014-23 : రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్ల పాలనపై 'స్వేదపత్రం' పేరిట తెలంగాణ భవన్​లో బీఆర్ఎస్​ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్​ ఇచ్చారు. అసెంబ్లీలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్​ పాలనను బద్నాం చేసేలా కొంత ప్రయత్నం చేసిందని ఆరోపించారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, చివరకు వాయిదా వేసుకొని పోయారని మండిపడ్డారు. అందుకే బాధ్యత గల పార్టీగా 'స్వేద పత్రం' విడుదల చేస్తున్నామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ప్రభుత్వం చేసిన ఆరోపణలు, విమర్శలకు దీటుగా సమాధానం చెప్పామని పేర్కొన్నారు.

"రాష్ట్రం ఏర్పడక ముందు అన్ని రంగాల్లోనూ తెలంగాణపై వివక్ష నెలకొంది. ఎన్నో పోరాటాల తర్వాత తెలంగాణ సాకారమైంది. ఇప్పుడు కొందరు తమ వల్లనే తెలంగాణ వచ్చిందని చెబుతున్నారు. ఉద్యమంలో విరిగిన లాఠీలు, పేలిన బుల్లెట్లకు లెక్కలేదు. తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపించే ప్రయత్నం జరుగుతోంది. తెలంగాణ ప్రయోగం విఫలం అవుతుందని కొందరు విమర్శించారు. తొలినాళ్లలోనే కొందరు ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారు."- కేటీఆర్, బీఆర్ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్

KTR Presentation On BRS Govt Nine and Half Year Rule : కోట్లమంది చెమటతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్న తీరును వివరించేందుకే స్వేద పత్రంపై ప్రెజంటేషన్​ ఇచ్చామని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని చెప్పారు. విధ్వంసం నుంచి వికాసం వైపు, సంక్షోభం నుంచి సమృద్ధి వైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించామని వెల్లడించారు. తెలంగాణ ఆకాశమంత ఎత్తులో అగ్ర రాష్ట్రంగా ఉందన్న కేటీఆర్ రాష్ట్రానికి అస్థిత్వమే కాదు ఆస్తులు కూడా సృష్టించామని వివరించారు.

రాష్ట్రం దివాళా తీయలేదు - దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారు : కేటీఆర్

KTR On TSRTC Development : ఆర్టీసీకి ఎన్నో విలువైన ఆస్తులు ఉన్నాయని కేటీఆర్ అన్నారు. కార్పొరేషన్ ఆస్తులు తనఖా పెట్టుకొని అప్పులు తెచ్చుకుంటే కేసీఆర్‌ను బద్నాం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇవాళ ఆకాశం అంత ఎత్తున ఉందన్న కేటీఆర్ ఆస్తులనే కాదు తెలంగాణ అస్తిత్వాన్ని కూడా కేసీఆర్(KCR Government Development) నేతృత్వంలోని ప్రభుత్వం సృష్టించిందని వెల్లడించారు. 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్‌కు ఎంత వెల కడతారని ప్రశ్నించారు.

"60 ఏళ్లలో రూ.4,98,053 కోట్లు ఖర్చు చేశారన్నది శుద్ధ అబద్ధం. జనాభా ఆధారంగా తెలంగాణ వాటా అంటూ తప్పుడు లెక్కలు చూపించారు. రాష్ట్రంలో గత పదేళ్ల ఖర్చు రూ.13,72,930 కోట్లు. విద్యుత్‌ రంగంలో మేం సృష్టించిన ఆస్తుల విలువ రూ.6,87,585 కోట్లు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడకగా, అంకెల గారడీలా ఉంది. రాష్ట్రానికి స్థూలంగా ఉన్న రుణాలు రూ. 3,17,051 కోట్లు మాత్రమే. తలసరి ఆదాయం రూ.1,12,162 నుంచి రూ. 3,17,115కు పెంచాం. జీఎస్‌డీపీ రూ. 4.51 లక్షల కోట్ల నుంచి రూ.13.27 లక్షల కోట్లకు పెంచాం."- కేటీఆర్, బీఆర్ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్

గవర్నర్‌ ప్రసంగం తప్పుల తడకగా ఉంది - మేం ఏం చేశామో ప్రజలకు తెలుసు : కేటీఆర్

రూ. 3 లక్షల కోట్ల అప్పును రూ.6 లక్షల కోట్ల అప్పులుగా చూపించే ప్రయత్నం చేశారని కేటీఆర్​ ధ్వజమెత్తారు. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన రుణాలు, ఇవ్వని రుణాలను కూడా అప్పులుగా చూపుతున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ, విద్యుత్‌, పౌరసరఫరాల్లో లేని అప్పు ఉన్నట్టు చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌర సరఫరాల సంస్థకు ఇప్పటి వరకు ఉన్న అప్పు రూ.21,029 కోట్లని తెలిపారు. నిల్వలు, కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులను దాచి అప్పులు ఎక్కువగా ఉన్నాయని చూపించారని ఆరోపించారు.

KTR Fire on Congress Government : ప్రాధమ్యాలు ఏర్పాటు చేసుకుని రాష్ట్రాన్ని ప్రగతిబాట పట్టించామని కేటీఆర్(KTR Presentation on Farmers) ఉద్ఘాటించారు. సంక్షేమం, విద్యుత్‌, వ్యవసాయం ఇలా ప్రాధమ్యాలు నిర్దేశించుకున్నామని చెప్పారు. రైతులు, పాడి రైతుల స్వేదంతో సృష్టించిన సంపదను శ్వేతపత్రంలో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. మత్స్యకారులు, గొర్రెల కాపరులు సృష్టించిన సంపదను ఎందుకు చెప్పలేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.

తెలంగాణ ప్రతిష్ఠను దెబ్బతీస్తే సహించేది లేదు: కేటీఆర్‌

'సీఎం రేవంత్​ రెడ్డికి పంటల బీమాకు, రైతు బీమాకు తేడా తెలియదు'

Last Updated : Dec 24, 2023, 3:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.