ETV Bharat / state

రైతుబంధు ఇస్తారో లేదో కాంగ్రెస్​ సర్కార్ స్పష్టంగా చెప్పాలి : మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డి

BRS Leader Niranjan Reddy on Rythubandhu : గ్యారంటీలకు దరఖాస్తులు ఓ నాటకమని మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డి కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. చేవెళ్ల పార్లమెంటు టికెట్‌ను మళ్లీ రంజిత్‌ రెడ్డికే ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణ భవన్​లో నేడు చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది.

BRS Leader Niranjan Reddy Press meet
BRS Leader Niranjan Reddy
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 5, 2024, 6:21 PM IST

BRS Leader Niranjan Reddy on Rythubandhu : చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో రంజిత్‌ రెడ్డిని మళ్లీ పెద్ద మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డి(Niranjan Reddy) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సమావేశాల్లో భాగంగా నేడు చేవెళ్ల నియోజకవర్గంపై తెలంగాణ భవన్​లో చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

దిల్లీలో తెలంగాణ నేతలు అంటే బీఆర్‌ఎస్‌ నేతలే గుర్తుకువస్తారని మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. లోక్‌సభ ఎన్నిక్లలో(Lok Sabha) బీఆర్‌ఎస్సే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు 2 శాతం ఓట్లు మాత్రమే తేడా అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. బీఆర్‌ఎస్‌ ఓడిపోయిందని తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. ప్రజలు బీఆర్‌ఎస్‌తోనే ఉన్నారని, పార్లమెంటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో తామే గెలుస్తామన్నారు. లోటు పాట్లను విశ్లేషించుకుని ముందుకెళ్తామని చెప్పారు.

ఎన్నికలప్పుడు రైతుబంధు(Rythu Bandhu)ను ఆపింది కాంగ్రెస్‌ కాదా అంటూ మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డి ప్రశ్నించారు. రైతుబంధు అందరికీ ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు చెప్పి మరీ రైతుబంధు ఇచ్చేవాళ్లమని గుర్తు చేశారు. రైతుల వివరాలు మొత్తం వ్యవసాయ శాఖ దగ్గర ఉన్నాయని, ఆ వివరాలు ఉన్నా రైతుబంధు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు.

పొరపాట్లు జరిగాయి - సరిదిద్దుకొని ముందుకెళ్తాం : కేటీఆర్

BRS Parliament Preparatory Meeting at Chevella : రైతులను కాంగ్రెస్‌ ప్రభుత్వం అవమానించిందని, అందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. వరి పండిస్తున్న ఒక్క రైతుకైనా రూ.1500 బోనస్‌ ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. రైతు రుణమాఫీ(Farmer Loan Waiver Scheme) అన్నారు ఒక్కరికైనా వేశారా అంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక నిత్యావసర ధరలు పెరిగిపోయాయని ఆరోపించారు. సన్నబియ్యం లేవు, ఉన్న బియ్యం రేటు పెరిగిందని ఎద్దేవా చేశారు. నిత్యావసర ధరలను ప్రభుత్వం కట్టడి చేయాలని నిరంజన్‌ రెడ్డి కోరారు.

కాంగ్రెస్‌ పార్టీని నమ్మి మోసపోయామని రైతులు అంటున్నారని మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. 11 విడతల రైతుబంధు చెల్లింపులు నిర్దిష్ట గడువులో చెల్లించామని చెప్పారు. పాలనపై దృష్టి పెట్టకుండా అధికారాన్ని కోల్పోయిన బీఆర్‌ఎస్‌పై దృష్టిపెడితే ఇలాగే ఉంటుందని మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డి పేర్కొన్నారు. గ్యారంటీలకు దరఖాస్తులు ఓ నాటకం అని విమర్శించారు. మేధావులు రైతుల పక్షాన ఉంటారో లేదో తేల్చుకోవాలన్నారు. రైతుబంధు ఇస్తారో లేదో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని నిరంజన్‌ రెడ్డి అడిగారు.

మహేందర్‌ రెడ్డి వర్సెస్​ రోహిత్‌ రెడ్డి - హరీశ్​రావు సాక్షిగా బీఆర్​ఎస్​లో బయటపడిన వర్గపోరు

ప్రజాస్వామ్యబద్ధంగా హామీలు అమలు చేయాలని కోరితే బీఆర్‌ఎస్‌పై నిందలా : వినయ్‌ భాస్కర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.