ETV Bharat / state

మహేందర్‌ రెడ్డి వర్సెస్​ రోహిత్‌ రెడ్డి - హరీశ్​రావు సాక్షిగా బీఆర్​ఎస్​లో బయటపడిన వర్గపోరు

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 5, 2024, 5:34 PM IST

Ex Minister Mahender Reddy VS Ex MLA Rohith Reddy : బీఆర్ఎస్​ చేవెళ్ల లోక్​సభ సన్నాహక సమావేశంలో నాయకుల మధ్య వర్గపోరు బయటపడింది. ఎమ్మెల్సీ మహేందర్​ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్​ మధ్య వాగ్వాదం అయింది. దీంతో ఇరువర్గాల కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేసుకోవడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వారికి మాజీ మంత్రి హరీశ్​రావు సర్దిచెప్పారు.

BRS Leaders Godava at Telangana Bhavan
Mahender Reddy VS Rohith Reddy

Ex Minister Mahender Reddy VS Ex MLA Rohith Reddy : లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో తాండూరు నియోజకవర్గం బీఆర్​ఎస్​ నేతల మధ్య వర్గపోరు భగ్గుమంది. నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా పరస్పరం విమర్శలు చేసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల కోసం శ్రేణులను సన్నద్ధం చేసేందుకు పార్టీ నాయకత్వం వరుసగా సన్నాహక భేటీలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌(BRS Meetings at Telangana Bhavan Today) వేదికగా జరిగిన చేవెళ్ల నియోజకవర్గ సన్నాహక సమావేశానికి పార్టీ నేతలు హరీశ్‌రావు, కేకేతో పాటు మాజీ మంత్రులు, కీలక నేతలు హాజరయ్యారు.

ఒక్క ఎమ్మెల్యేను తీసుకుంటే అక్కణ్నుంచి పది మంది వస్తారు : గంగుల

BRS Leaders Godava at Telangana Bhavan : బీఆర్ఎస్ నాయకుల భేటీకి చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్​కు చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు హాజరయ్యారు. నేతలందరి నుంచి అభిప్రాయాలు సేకరించే క్రమంలో మాజీ మంత్రి మహేందర్‌ రెడ్డి మాట్లాడుతుండగా, రోహిత్‌ రెడ్డి వర్గీయులు అభ్యంతరం తెలిపారు. పార్టీ ఓటమికి కారణమైన వారికి మాట్లాడే అవకాశం ఇవ్వొద్దంటూ నినాదాలు చేశారు. రోహిత్‌రెడ్డి వర్గీయుల తీరుపై మహేందర్‌రెడ్డి అనచరులు మండిపడ్డారు. ఇరువర్గాల పరస్పర విమర్శలతో సమావేశంలో గందరగోళం నెలకొంది. ఇదే సమయంలో వేదికపై ఉన్న మహేందర్‌ రెడ్డి, రోహిత్‌ రెడ్డి మధ్య కూడా స్వల్ప వాగ్వాదం జరిగింది.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక - పార్టీ వాణి బలంగా వినిపించే వారికే బీఆర్ఎస్ ఛాన్స్!

Ex Minister Harish Rao Stop Leaders Conflict : వేదికపై ఉన్న హరీశ్‌రావు, ఇతర ముఖ్య నేతలు కలగజేసుకుని, ఇద్దరు నేతలతో పాటు వారి అనుచరులకు నచ్చజెప్పారు. అనంతరం భోజన విరామం ప్రకటించారు. భోజన విరామ సమయంలో మహేందర్‌ రెడ్డి, రోహిత్‌ రెడ్డితో మాజీ మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమై సర్దిచెప్పారు. భోజన విరామం అనంతరం సన్నాహక సమావేశం తిరిగి ప్రారంభమైంది. ఓటమికి గల కారణాలు, భవిష్యత్‌ కార్యాచరణపై ఎవరైనా ఓపికగా చెప్పాలి తప్పితే, ఆవేశానికి గురికావొద్దని హరీశ్‌రావు(Ex Minister Harish Rao) నాయకులకు సూచించారు. కార్యకర్తలు ఆవేశాలకు లోను కావొద్దని, ఎవరిపైనా విమర్శలు చేయకుండా అభిప్రాయాలు చెప్పాలని సూచించారు. అందరమూ ఒక కుటుంబంలా వ్యవహరించాలని పేర్కొన్నారు. తర్వాత సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి లోక్​సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా కృషి చేద్దామని అన్నారు.

పొరపాట్లు జరిగాయి - సరిదిద్దుకొని ముందుకెళ్తాం : కేటీఆర్

BRS Lok Sabha Election Meeting : జనవరి 3 నుంచి నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్​ సన్నాహక సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ఈ నెల 21 వరకు జరగనుంది. మొదటి విడతలో మూడో తేదీ నుంచి 12 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. సంక్రాంతి పండుగ ఉన్నందున విరామం ఇవ్వనున్నారు. అనంతరం 16 నుంచి 21 వరకు మిగిలిన నియోజకవర్గాల నాయకులతో సమావేశం కానున్నారు. ఈ కార్యక్రమంలో లోక్​సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పని చేస్తున్నామని, జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతామని పార్టీ నాయకులు తెలిపారు.

జనవరి 3 నుంచి బీఆర్​ఎస్​ పార్లమెంటు ఎన్నికల శంఖారావం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.