ETV Bharat / state

వ్యూహాలకు పదును పెడుతూ ముందుకు సాగుతున్న గులాబీ దళం - హ్యాట్రిక్ విజయం ఖాయం!

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 10, 2023, 10:55 AM IST

BRS Election Campaign in Telangana : తెలంగాణలో అధికార పార్టీ ప్రచారాన్ని వేగవంతం చేసింది. మూడోసారి అధికారమే లక్ష్యంగా అభ్యర్థులు ఇంటింటి ప్రచారాలు చేస్తున్నారు. గత తొమ్మిదన్నరేళ్లుగా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు.

BRS Master Election Campaign
BRS Election Campaign in Telangana

BRS Election Campaign in Telangana ప్రచార స్పీడును పెంచిన బీఆర్ఎస్ అభ్యర్థులు తొమ్మిదిన్నరేళ్ల అభివృద్ధే అస్త్రంగా ప్రజల్లోకి

BRS Election Campaign in Telangana : ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ అధికార పార్టీ (BRS Party) వ్యూహాలకు పదును పెడుతోంది. మూడోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. తొమ్మిదినరేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని వివరిస్తూ బీఆర్​ఎస్ నేతలు ఇంటింటి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ భరోసా పేరుతో ప్రకటించిన మేనిఫెస్టోను జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు. విపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

తెలంగాణలో రాజకీయ అస్థిరత తెచ్చే ప్రయత్నం - విచక్షణా జ్ఞానంతో ఆలోచించి ఓటు వేయండి : కేసీఆర్

BRS MLA Candidates Election Campaign 2023 : మూడోసారి రాష్ట్రంలో అధికారం నిలుపుకునేలా బీఆర్​ఎస్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. అగ్రనేత కేసీఆర్ నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహిస్తుండగా... మిగతా నేతలు గడప, గడపకూ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ అభ్యర్థి అనిల్‌ జాదవ్‌కు.. ఓయూ జేఏసీ పూర్తి మద్దతు పలికింది. కామారెడ్డి జిల్లా జుక్కల్‌ మండలం మహ్మదాబాద్‌ హన్మంత్‌ షిండేకు నిరసన సెగ తగిలింది. మూడుసార్లు గెలిపిస్తే ఏం అభివృద్ధి చేశారంటూ నిలదీశారు. దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లో మంత్రిహరీశ్‌ రావు సమక్షంలో పలువురు బీఆర్​ఎస్​లో చేరారు. ఇటీవల దాడికి గురైన దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న హరీశ్‌రావు.. కాంగ్రెస్‌, భాజపాలపై విమర్శలు గుప్పించారు.

హ్యాట్రిక్‌ గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రచార హోరు - అభివృద్ధిని గుర్తించి దీవించాలని వేడుకుంటున్న అభ్యర్థులు

"బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు టికెట్ ఇవ్వడానికే ఆగం అవుతున్నారు. ఇక అధికారంలోకి వచ్చాక ప్రభుత్వాన్ని నడిపే శక్తి వాళ్లకు ఉందంటారా. పుట్టిన పిల్ల తల్లి చేతుల్లోనే సురక్షితంగా ఉంటుంది. తెలంగాణ.. తీసుకువచ్చిన సీఎం కేసీఆర్ చేతుల్లో ఉంటేనే క్షేమంగా, లాభంగా ఉంటది. అందుకే మన కేసీఆర్​ను మనం గెలిపించుకుందాం. మన తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడుకుందాం." - హరీశ్​రావు బీఆర్ఎస్ మంత్రి

గెలుపు బాటలో అభ్యర్థుల హోరాహోరీ-పాదయాత్రలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఓట్ల వేట

మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలంలో.. ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌ నిర్వహించిన ప్రచారంలో మహిళలు బతుకమ్మలు, కోలాటాలతో అలరించారు. ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ఆత్మీయ సమ్మేళనాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈనెల 11న హైదరాబాద్‌ శామీర్‌పేటలో జరిగే గిరిజన ఆత్మగౌరవ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్‌ కోరారు. గిరిజనులను బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు మోసం చేశాయని మహబూబాబాద్‌లో మంత్రి సత్యవతి విమర్శించారు. నేటితో నామినేషన్ల సమర్పణ గడువు పూర్తి అవుతుడంటంతో.. అభ్యర్థులు ప్రచారాన్ని మరింత వేగవంతం చేయనున్నారు.

"ఎక్కువ సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు తీసుకురాలేదు. కేవలం కేసీఆర్ మాత్రమే రిజర్వేషన్లను పెంచారు. ఇంత చేసిన బీఆర్ఎస్​కు ఓటు వేయాలి." - సత్యవతి రాఠోడ్, బీఆర్ఎస్ మంత్రి

రణరంగంగా మారిన ఇబ్రహీంపట్నం-కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.