ETV Bharat / state

BJP Telangana Assembly Elections Strategy 2023 : బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లేలా వ్యూహాలు​.. RSS నేతలతో కలిసి ప్రచారంపై ప్రణాళికలు!

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 29, 2023, 9:13 AM IST

BJP Telangana Assembly Elections Strategy 2023 : ఎన్నికల వ్యూహాలపై బీజేపీ మరింత దృష్టి సారించింది. బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లే వ్యూహాలను సిద్ధం చేసే పనిలో పడింది. రానున్న రోజుల్లో ప్రధాని మోదీ, అమిత్‌ షా, నడ్డా, యోగీలతో బహిరంగ సభలు, ఆర్ఎస్‌ఎస్‌ నేతలతో కలిసి ఎన్నికల ప్రచారంపై కమలనాథులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

BJP
BJP

BJP Strategies on Telangana Assembly Elections 2023 ఎన్నికల వ్యూహాల కసరత్తు వేగవంతం చేసిన బీజేపీ

BJP Strategies on Telangana Assembly Elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహ రచనపై కమలనాథులు కసరత్తును వేగవంతం చేశారు. బీజేపీ కీలక నాయకులు శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వరుసగా సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇంట్లో జరిగిన ఈ సమావేశాల్లో.. సంఘ్‌ నేతలతో భేటీ దాదాపు గంటన్నర పాటు సాగింది.

బీసీ ముఖ్యమంత్రి, పార్టీ ఎన్నికల ప్రణాళిక, అగ్రనేతలతో నిర్వహించే బహిరంగ సభలపై ఈ సమావేశాల్లో చర్చించారు. బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్‌ సునీల్‌ బన్సల్‌, రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జ్‌ ప్రకాశ్‌ జావడేకర్‌, కేంద్రమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy), ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ తదితరులు హాజరయ్యారు.

BJP Janasena Alliance in Telangana : బీజేపీ-జనసేన పొత్తు కుదిరింది..! ఇక సీట్ల లెక్క తేలాలి

అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తే.. బీసీని ముఖ్యమంత్రిని చేస్తామన్న పార్టీ ప్రకటనపై ప్రధానంగా చర్చించారు. ఈ అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటర్లను ఆకట్టుకోవడానికి అనుసరించాల్సిన ప్రణాళికలపై మంతనాలు జరిపారు. ఈ సమావేశంలో అగ్రనేతల ప్రచారంపైనా నేతలు సమాలోచనలు జరిపారు. ప్రధాని నరేంద్ర మోదీతో (Narendra Modi) సుమారు ఐదు జిల్లాల్లో బహిరంగ సభల ద్వారా ప్రచారం చేయించే ప్రణాళిక గురించి చర్చించినట్లు సమాచారం.

Telangana Assembly Elections 2023 : బీజేపీ అగ్రనేత అమిత్‌ షా (Amit Shah), పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లు ఎక్కువ సభల్లో ప్రచారం చేయించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో కీలక నేతలు 50కి పైగా బహిరంగ సభల్లో పాల్గొనే అవకాశాలున్నాయని బీజేపీ వర్గాలు తెలిపాయి.

Opposition parties Telangana Election Campaign 2023 : బీఆర్​ఎస్​ని అధికారం నుంచి దించేందుకు.. ప్రతిపక్షాల వ్యూహాలు

BJP MLA Candidates List 2023 : బీజేపీ ఇప్పటి వరకు 53 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించింది. మొదటి జాబితాలో 52 మందిని ప్రకటించగా.. రెండో జాబితాలో ఒక్క అభ్యర్థినే ప్రకటించింది. మొత్తం మీద ఈ లిస్టులో బీసీలతో పాటు సీనియర్లకు కూడా స్థానం ఇవ్వగా.. ముగ్గురు ఎంపీలు ఈసారి అసెంబ్లీ బరిలో నిలిచారు. నిజామాబాద్‌ ఎంపీగా ఉన్న ధర్మపురి అర్వింద్‌ కోరుట్ల నుంచి.. కరీంనగర్‌ ఎంపీగా ఉన్న బండి సంజయ్‌.. ఈసారి కరీంనగర్‌ ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. ఎంపీ సోయం బాపూరావు బోథ్‌ నుంచి బరిలోకి దిగి.. తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

Kishan Reddy Interesting Comments : 'అధికారం శాశ్వతం కాదు.. ప్రతిపక్షంలో కూర్చోవడానికి బీజేపీ సిద్ధం'

మరోవైపు ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌తో పాటు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోటీ చేసే గజ్వేల్‌ నుంచి బరిలోకి దిగనున్నారు. రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్‌ సర్కారును నెలకొల్పాలనే సంకల్పంతో కేంద్ర బీజేపీ నాయకత్వం ఉందని.. పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

BJPs Firebrand Leaders Contesting from Joint Karimnagar : ఒకే ఉమ్మడి జిల్లాలో ముగ్గురు ఫైర్​ బ్రాండ్​ నేతల పోటీ.. బీజేపీ ప్లాన్​ వర్కౌట్​ అయ్యేనా..?

Telangana Election Campaign 2023 : రాష్ట్రంలో జోరందుకున్న ఎన్నికల ప్రచారాలు.. ఇంటింటికి వెళ్తూ.. ఓట్లు అడుగుతున్న అభ్యర్థులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.