ETV Bharat / state

Bandi Sanjay on oldcity: పాతబస్తీ న్యూ సిటీ ఎందుకు కావొద్దు: బండి సంజయ్

author img

By

Published : Jun 2, 2022, 1:48 PM IST

Bandi sanjay on Rasheed Khan
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

Bandi Sanjay on oldcity: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చార్మినార్‌పై నమాజ్‌కు అనుమతించాలని చేపట్టిన సంతకాల సేకరణపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుంటేనే నమాజ్‌ గుర్తుకు వచ్చిందా అని నిలదీశారు.

Bandi Sanjay on oldcity: పాతబస్తీని ఎంఐఎం కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర సెక్రటరీ రషీద్‌ ఖాన్​ చార్మినార్‌పై నమాజ్‌కు అనుమతించాలని చేపట్టిన సంతకాల సేకరణపై తీవ్రస్థాయిలో ఆయన స్పందించారు. భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుంటేనే నమాజ్‌ గుర్తుకు వచ్చిందా అని నిలదీశారు. అంతకు ముందు నమాజ్‌ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

ముస్లిం మేధావి వర్గం ఆలోచించాలని మేం విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంఐఎం పార్టీ ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నది. ఓల్ట్​ సిటీ న్యూ సిటీ ఎందుకైతలేదు. గోకుల్ చాట్, సాయిబాబా టెంపుల్, లుంబినీ పార్కులో బాంబులు పేల్చింది ఎవరు? దేశంలో ఏ సంఘటన జరిగినా ఓల్ట్ సిటీ పేరు ఎందుకు వస్తోంది. మేం భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్తేనే నమాజ్ గుర్తుకొచ్చిందా? - బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

చార్మినార్‌ను తొలగించాలని తామెప్పుడూ చెప్పలేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈ సంతకాల సేకరణను ముస్లిం సమాజం కూడా క్షమించదన్నారు. కాంగ్రెస్‌, ఎంఐఎం, తెరాస కలిసి డ్రామాలాడుతున్నాయని ఆయన మండిపడ్డారు. పాతబస్తీ న్యూ సిటీ ఎందుకు కాకూడదని ప్రశ్నించారు. పాతబస్తీ యువతకు పాస్‌పోర్టు ఎందుకు రావడం లేదన్నారు. ఇరుకు రోడ్లలో ఎన్నో ఏళ్లుగా ఎందుకు మగ్గుతున్నారని రషీద్‌ఖాన్‌కు పలు ప్రశ్నలు సంధించారు. పాతబస్తీకి మెట్రో రైలు ఎందుకు రాదని బండి సంజయ్ నిలదీశారు.

ఓల్డ్​ సిటీ.. న్యూ సిటీ ఎందుకు కాకూడదు?: బండి సంజయ్

ఇవీ చదవండి: Telangana Formation Day 2022: రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

సోనియా గాంధీకి కరోనా- ఈడీ విచారణకు హాజరు కష్టమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.