ETV Bharat / state

BJP Leaders Fires on KCR: కేసీఆర్ కొత్త రాజ్యాంగం వ్యాఖ్యలపై భాజపా నేతల ఫైర్​.. ఏమన్నారంటే?

author img

By

Published : Feb 2, 2022, 3:17 PM IST

BJP Leaders Fires on KCR
BJP Leaders Fires on KCR

BJP Leaders Fires on KCR:ముఖ్యమంత్రి కేసీఆర్​ కొత్త రాజ్యాంగం వ్యాఖ్యలపై భాజపా నేతలు విరుచుకుపడ్డారు. ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగం రచించిన అంబేడ్కర్​ను అవమానించారని ఆరోపించారు. కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కేసీఆర్ కొత్త రాజ్యాంగం వ్యాఖ్యలపై భాజపా నేతల ఫైర్

BJP Leaders Fires on KCR: భాజపాను బలహీనపరిచే కుట్ర జరుగుతోందని ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్​ దిల్లీలో ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చాలంటూ.. కేసీఆర్​ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ.. దిల్లీలోని తెలంగాణ భవన్​ వద్దనున్న అంబేడ్కర్​ విగ్రహానికి భాజపా నేతలు పాలాభిషేకం చేశారు. అంబేడ్కర్‌ను స్ఫూర్తిగా పాలన చేస్తున్నది భాజపా అని బండి సంజయ్​ పేర్కొన్నారు. కేసీఆర్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ రేపు పార్టీ కార్యాలయాల్లో దీక్షలు చేస్తామని వెల్లడించారు.

వచ్చే ఎన్నికల్లో తెరాస గెలిచేది 9 సీట్లు మాత్రమే

రాజ్యాంగం మారుస్తామని భాజపా ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తెరాస గెలిచేది 9 సీట్లు మాత్రమేనని జోస్యం చెప్పారు. జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతోనే కేసీఆర్‌ విచిత్రంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మరోసారి సెంటిమెంట్‌ రెచ్చగొట్టి లబ్ది పొందాలనేది కేసీఆర్‌ ఆలోచన అని అభిప్రాయపడ్డారు. తెలంగాణకు అన్యాయం జరిగితే మోదీని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.

తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునే దుస్థితి నెలకొంది. రాజ్యాంగాన్ని ముట్టుకుని చూడు.. నీకు రాజ్యాంగం వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటీ? ప్రపంచమంతా భారత రాజ్యాంగాన్ని చూసి ప్రశంసిస్తోంది. బడ్జెట్​పై అభ్యంతరాలు చెప్పండి... ఇబ్బందేమి లేదు.. కానీ బూతులు మాట్లాడటం సిగ్గు చేటు. దళితులంటే.. ఎందుకంత చులకన. ఎందుకు అంబేడ్కర్​ జయంతి, వర్ధంతిలకు హాజరు కావు... కేసీఆర్​కు దళితులపై ద్వేషం ఉంది.

- బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

Etela fires on cm kcr comments:

కల్వకుంట్ల రాజ్యాంగం కావాలని కేసీఆర్​ ఆరాటపడుతున్నారు: ఈటల

మరోవైపు హుజూరాబాద్​ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ కూడా కేసీఆర్​పై విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలంటూ అంబేడ్కర్​ను అవమానించారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. రాజ్యాంగం దోపిడి పక్షపాతంకు వ్యతిరేకంగా సమానతను పంచిందని ఈటల అన్నారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఈటల గుర్తు చేశారు. ఎవరి లాగులు పగలకొడతావని ఘాటుగా ప్రశ్నించారు. తెలంగాణలో అనేక మంది ఐఏఎస్‌ అధికారులు కేసీఆర్ పాలనను భరించలేక రాజీనామా చేశారని తెలిపారు. కల్వకుంట్ల రాజ్యాంగం కావాలని కేసీఆర్ ఆరాటపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు, రాచరిక పరిపాలన కావాలని కేసీఆర్ కోరుకుంటున్నారని తెలిపారు. నిర్మలాసీతారామన్ గొప్ప బడ్జెట్‌ను ప్రవేశపెడితే కేసీఆర్ వ్యతిరేకించారని.. ఆయన వ్యాఖ్యలను చూసి గ్రామాల్లోని మహిళలు టీవీలు బంద్‌ చేసుకున్నారని తెలిపారు.

ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగం మనదని తెలిపారు. అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా రాజ్యాంగం ఉందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ స్పష్టం చేశారు. అంబేడ్కర్‌ ఎంతో ముందుచూపుతో రాజ్యాంగం రచించారని పేర్కొన్నారు. అందరికీ రాజకీయ, భావప్రకటన స్వేచ్ఛ కల్పించారని చెప్పారు. అంబేడ్కర్‌ను సీఎం కేసీఆర్‌ అవమానించారని ఆరోపణలు చేశారు ఈటల. అంబేడ్కర్‌ ముందుచూపు వల్లే తెలంగాణ సాకారమైందన్నారు. అంబేడ్కర్‌ చేర్చిన ఆర్టికల్‌ 3 వల్లే తెలంగాణ సాకారమైందని గుర్తు చేశారు. దార్శనికులైన అంబేడ్కర్‌ను కేసీఆర్‌ అవమానించారని ఈటల మండిపడ్డారు. రాష్ట్రంలో స్వేచ్ఛ లేకుండా చేస్తున్నది కేసీఆర్ కాదా? అని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్ని వర్గాల, కులాల, ప్రాంతాల వారికి న్యాయం జరిగేలా రాజ్యాంగం ఉంది. ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగం మనది. బీఆర్‌ అంబేడ్కర్‌ ఎంతో ముందుచూపుతో రాజ్యాంగాన్ని రచించారు భారత జాతి ముద్దుబిడ్డ అంబేడ్కర్‌ను సీఎం కేసీఆర్‌ అవమానించారు. దేశంలో అందరికీ సమానత్వాన్ని కల్పించింది రాజ్యాంగం. అందరికీ సమానంగా రాజకీయ, భావప్రకటనా స్వేచ్ఛను కల్పించారు. అంబేడ్కర్‌ ముందుచూపుతో ఏర్పాటు చేసిన ఆర్టికల్‌ వల్లే తెలంగాణ ఏర్పాటు జరిగింది. మెజార్టీ ప్రజల ఆమోదం అవసరం లేకుండానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేలా రాజ్యాంగంలో ఆర్టికల్‌ను అంబేడ్కర్‌ చేర్చారు.

- ఈటల రాజేందర్​, హుజూరాబాద్​ ఎమ్మెల్యే

కాళేశ్వరం పేరుచెప్పి లక్షల కోట్లు దోచుకున్నారు: డీకే అరుణ

కేంద్ర బడ్జెట్‌పై స్పందిస్తూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి వాడిన భాష సరిగ్గా లేదని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. కేసీఆర్​ మాట్లాడుతున్న భాషను ప్రజలు గమనించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ఏడేళ్లలో ఏం చేశారో కేసీఆర్​ చెప్పాలని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. దేశంలోని ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలను ఎలా పంపుతున్నారని ప్రశ్నించారు.

ఎవరూ మాట్లాడలేని భాషను సీఎం కేసీఆర్‌ మాట్లాడుతున్నారు. సీఎంగా ఈ ఏడేళ్లలో రాష్ట్రానికి ఏం చేశారో కేసీఆర్‌ చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. లక్షల కోట్లు దోచుకున్నారు. ఎన్నికలకు జరిగే రాష్ట్రాలకు రూ. వేల కోట్లు ఎలా పంపుతున్నారు.

- డీకే అరుణ, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం

ఇదీ చూడండి: Hyderabad Drug Case: మాదక ద్రవ్యాల కేసులో 9 మందికి బెయిల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.