ETV Bharat / state

Telangana Congress Joinings : కాంగ్రెస్‌లో చేరికలపై కొనసాగుతున్న ఉత్కంఠ.. బుజ్జగింపులే కారణమా..?

author img

By

Published : Jul 17, 2023, 6:53 AM IST

New Joinings in T Congress : కాంగ్రెస్‌లో చేరికలపై ఉత్కంఠ కొనసాగుతోంది. బీఆర్ఎస్, బీజేపీలోని కొందరు నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ.. ఇప్పటికిప్పుడే చేరేందుకు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. అసంతృప్తులను ఆయా పార్టీలు బుజ్జగిస్తుండటంతో.. చేరికలు ఆలస్యమవుతాయని కాంగ్రెస్‌ భావిస్తోంది.

Telangana Congress Joinings
Telangana Congress Joinings

కాంగ్రెస్‌లో చేరికలపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ప్రజాధారణ కలిగిన నాయకులకు టికెట్లు ఖాయం..!

T Congress focus on Joinings : నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో నిర్వహించనున్న పాలమూరు ప్రజాభేరి సభలో భారీగా చేరికలు ఉండేలా కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. భారతీయ జనతా పార్టీకి చెందిన ముగ్గురు నలుగురు ముఖ్య నాయకులతో చర్చలు జరుపుతోంది. కాంగ్రెస్‌ ఆకర్ష్‌తో అప్రమత్తమై బీజేపీ నేతలు.. అసంతృప్తుల ఇంటికి వెళ్లి బుజ్జగించారు. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి, మాజీ ఎంపీతో చర్చించారు.

BJP leader Join in Congress Party : బీజేపీ రాష్ట్ర నాయకత్వం మారిందని.. పార్టీలో తగిన ప్రాధాన్యత ఉంటుందని నచ్చజెప్పడంతో.. ఆ నలుగురు పార్టీ మారే విషయంలో కొంత వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇటీవల బీజేపీలో చేరిన ఇద్దరు నాయకులు కూడా కాంగ్రెస్‌ నేతలతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వారు కావడంతో.. సిట్టింగ్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Ponguleti Srinivas Reddy Congress : ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మాపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, ఆయన అనుచరులు.. వారితో గతంలో చనువుగా ఉంటున్న బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు చెందిన కొందరు నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీలో గెలిచేందుకు అవకాశం ఉన్న గెలుపు గుర్రాలకే టికెట్లు దక్కుతాయని, టికెట్లు కేటాయింపు పారదర్శికంగా ఉంటుందని కాంగ్రెస్‌ అధిష్ఠానం చెబుతున్నట్లు సంప్రదించిన నాయకులకు స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Telangana Congress Operation Akarsh : ప్రజాధారణ కలిగిన నాయకులకు టికెట్లు రావడం ఖాయమని కూడా భరోసా ఇస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా హైదరాబాద్‌ నగర నడిబొడ్డున ప్రాతినిథ్యం వహిస్తున్న ఓ ప్రజాప్రతినిధి కూడా కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు దిల్లీ స్థాయిలో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎన్‌ఆర్‌ఐ నాయకురాలు, బీజేపీ ముఖ్య నాయకురాలికి దగ్గర బందువు కూడా కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.

సనత్​నగర్‌లో మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌ రెడ్డి బీజేపీలోకి వెళ్లిన తర్వాత అక్కడ కాంగ్రెస్‌కు నాయకుడు కరవయ్యాడు. ఈ నేపథ్యంలో వైద్య వృత్తిలో ఉండి ఇటీవల పదవీ విరమణ పొందిన ఓ డాక్టర్‌ పార్టీలో చేరేందుకు మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు సీనియర్ నాయకులు, అధికార పార్టీలో పదవుల్లో ఉన్న నాయకులు కూడా కాంగ్రెస్‌ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.

Jupalli Krishna Rao Joins Congress : ఇప్పటికే పీసీసీ ఆధ్వర్యంలో చేరికలకు సంప్రదింపులు జరుపుతున్న ముఖ్యనాయకులు కొందరు.. ఇదే పనిలో ఉన్నప్పటికీ అన్ని కూడా సంప్రదింపుల దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రియాంకగాంధీ షెడ్యూల్‌ ఖరారు అయ్యేనాటికి జూపల్లి కృష్ణారావుతో పాటు ఎమ్మెల్సీ దామోదర్​రెడ్డి కుమారుడు రాజేశ్​రెడ్డి, గద్వాల్‌ జడ్పీ ఛైర్మన్‌ సరతి, ఆమె భర్త తిరుపతయ్యలతో పాటు ఇప్పుడు సంప్రదింపులు జరుపుతున్న వారిలో కొందరు అయినా పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.