ETV Bharat / state

ఎగ్జిట్‌ పోల్స్‌ ఎఫెక్ట్‌ - వేల కోట్లు దారి మళ్లించేందుకు బీఆర్ఎస్ ప్లాన్ : భట్టి విక్రమార్క

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 1, 2023, 10:47 PM IST

Bhatti Vikramarka Sensational Comments on BRS : ధరణి పోర్టల్‌లో వేలాది ఎకరాలు అక్రమంగా ఎక్కించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేసిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ పోర్టల్ ద్వారా లక్షల ఎకరాలు ప్రజలకు, ప్రభుత్వానికి దక్కకుండా పోయాయని మండిపడ్డారు. రెవెన్యూ వ్యవస్థను ముందుగానే అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల కోడ్ వచ్చేదాక రైతుబంధు విడుదల కాకుండా చేశారని మండిపడ్డారు. కోడ్ అమలులోకి రాగానే రైతుబంధు విషయంలో అందరిని మోసం చేసే ప్రయత్నం చేశారని విమర్శించారు. ప్రభుత్వాలు మారుతాయని తెలిసి ముందుస్తు నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

Bhatti Vikramarka Sensational Comments on BRS
Bhatti Vikramarka

ఎగ్జిట్‌ పోల్స్‌ ఎఫెక్ట్‌ - వేల కోట్లు దారి మళ్లించిందేందుకు బీఆర్ఎస్ ప్లాన్ : భట్టి విక్రమార్క

Bhatti Vikramarka Sensational Comments on BRS : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడే ముందు ప్రభుత్వం మారనున్న ఈ తరుణంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెల్లడించారు. సర్వే సంస్థలు అన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రకటించాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, ప్రజలకు ఇచ్చిన అసైన్డ్ భూములను ధరణిలో తప్పుడుగా నమోదు చేస్తున్నట్లు ఆరోపించారు. వేరే వ్యక్తుల పేర్ల మీదకు మార్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని విమర్శించారు.

Bhatti Vikramarka on BRS Land Grab : రైతులకు రైతుబంధు పథకాన్ని నిలిపివేసిన పరిస్థితుల్లో రాష్ట్రంలో అభివృద్ధి నిధులను పనులు పూర్తి కాకుండానే కాంట్రాక్టర్లకు దారి మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అప్రమతంగా ఉండాలని సూచించారు. గత ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ధర్మపురి, హుజూర్​నగర్, మంచిర్యాల, ఇబ్రహీంపట్నం, తుంగతుర్తిలో ఇబ్బందులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కోర్టులలో కేసులు కూడా ఇంకా నడుస్తున్నాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కౌంటింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు మార్పు కోసం తీసుకున్న నిర్ణయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కాంగ్రెస్​కి ఉందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

ఎగ్జిట్ పోల్ ఫలితాలతో కేటీఆర్ భయపడుతున్నారు - అందుకే వాటిని తప్పుగా చిత్రీకరిస్తున్నారు : పొన్నం ప్రభాకర్

Madhu Yashki Comments on BRS Government : ధరణిలో రాత్రికి రాత్రి భూములను ఇతరుల పేర్లపై మారుస్తున్నారని ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ ఆరోపించారు. రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, ఇందులో అనుమానమే అవసరం లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రైతులకు రైతుబంధు ఇవ్వకుండా ఆ డబ్బును దారి మళ్లించేందుకు కేసీఆర్‌ పావులు కదుపుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు మద్దతుగా నిలుస్తున్న అధికారులు, కాంట్రాక్టర్లు ఆరిపోతున్న దీపానికి సహాకరిస్తే ఇబ్బందుల్లో పడక తప్పదని హెచ్చరించారు.

Madhu Yashki Fires on KCR Family : రాష్ట్రంలో జరిగిన అవినీతిపై కల్వకుంట్ల కుటుంబాన్ని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. సోదరి కల్వకుంట్ల కవిత లిక్కర్ కుంభకోణంపై కూడా విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. అవినీతికి సహకరించే అధికారులు సైతం జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. ప్రగతిభవన్ నుంచి తరలుతున్న కోట్లాది రూపాయలు అవినీతి సొమ్మును అధికారులు కట్టడి చెయ్యాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టర్ల వద్ద కమిషన్లు దండుకునేందుకు అధికారంలోకి వస్తామని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఉద్యమ పార్టీగా చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీకి ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. బీజేపీ పార్టీకి కూడా స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయో ప్రజలు గమనించాలని మధుయాస్కీ వివరించారు.

కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన అందరికీ ధన్యవాదాలు : రేవంత్ ​రెడ్డి

ఎగ్జిట్ పోల్స్‌ ద్వారా తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని మరోసారి నిరూపితమైంది : కోదండరాం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.