ETV Bharat / state

Covaxin Booster Dose: 'కొవాగ్జిన్‌ బూస్టర్‌ డోసుతో మెరుగైన ఫలితాలు'

author img

By

Published : Jan 8, 2022, 8:23 PM IST

Bharath Biotech
Bharath Biotech

Covaxin Booster Dose: రెండు డోసులు వ్యాక్సిన్​ తీసుకున్న ఆరు నెలలకు కొవాగ్జిన్‌ బూస్టర్‌ డోసు తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తున్నాయని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ వెల్లడించింది. బూస్టర్‌ డోసుపై చేసిన ప్రయోగాలకు సంబంధించి వివరాలను విడుదల చేసింది.

Covaxin Booster Dose : రెండు డోసులు వ్యాక్సిన్​ తీసుకున్న వారితో పోలిస్తే బూస్టర్‌ డోసు తీసుకున్న వారిలో డెల్టాని నిలువరించే యాంటీబాడీల వృద్ధి ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుందని భారత్​ బయోటెక్​ ప్రకటించింది. బూస్టర్‌ డోసుపై చేసిన ప్రయోగాలకు సంబంధించి వివరాలను శనివారం విడుదల చేసింది. 90 శాతం మందిలో తీవ్రమైన కొవిడ్‌ స్ట్రెయిన్‌లను సైతం నిలువరించే శక్తిగల యాంటీబాడీలు వృద్ధి చెందినట్టు ఓ ప్రకటనలో పేర్కొంది.

రెండో డోస్ తీసుకున్న 6 నెలల తరువాత బూస్టర్ డోస్ తీసుకోవచ్చని తెలిపింది. బూస్టర్‌ డోసు తీసుకున్నవారిలో టి, బి సెల్‌ రెస్పాన్స్‌ గుర్తించామని తెలిపింది. బూస్టర్‌ డోసు తీసుకోవడం ద్వారా ఎక్కువ కాలం పాటు తీవ్ర కొవిడ్‌ నుంచి రక్షణ పొందొచ్చని పేర్కొంది. బూస్టర్​డోసుపై జరిపిన ప్రయోగాల్లో సత్ఫలితాలు రావడం పట్ల భారత్ బయోటెక్ ఛైర్మెన్ డాక్టర్ కృష్ణా ఎల్లా హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: Corona Vaccination In Telangana: తెలంగాణలో 100 శాతం మందికి కరోనా టీకా తొలిడోస్​ పూర్తి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.