ETV Bharat / state

Begging Mafia Arrest in Hyderabad : ఛారిటీల పేరుతో బెగ్గింగ్ దందా.. సంపాదించిన సొమ్ముతో ప్లాట్ల కొనుగోలు

author img

By

Published : Aug 20, 2023, 5:31 PM IST

Updated : Aug 20, 2023, 8:06 PM IST

Collecting Money in The Name of Charities : నగరంలో బెగ్గింగ్​ మాఫియా ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. అనాథ గృహాలు, ఫౌండేషన్ల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముఠాను నగర పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి లక్షల విలువైన స్థిరాస్తి డాక్యుమెంట్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు.

Fake Charities Begging Mafia Arrest in Hyderabad
Begging Mafia Arrest in Hyderabad

Fake Charities Begging Mafia Arrest in Hyderabad : ప్రార్ధించే పెదవులు కన్నా..సాయం చేసే చేతులు మిన్న, మీ పుట్టిన రోజు, పెళ్లి రోజున అనాథలకు సాయం చేయండి. వారికి ఒక రోజు అన్నం పెట్టి కడుపు నింపండి. ఇలాంటి సందేశాలతో ఉన్న స్టీల్ బాక్సులతో నగరంలో ప్రధాన కూడళ్ల వద్ద సాయం చేయమని కొందరు యువతులు అడగటం చూస్తుంటాం. కానీ ఈ బెగ్గింగ్ దందా వెనుక ఉన్న కేటుగాళ్లు ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే ముక్కుమీద వేలేసుకోవాల్సిందే. ఈ నేరగాళ్లు నగరంలోని శివారు ప్రాంతాల్లో 90లక్షలు విలుచేసే భూములు కొనుగోలు చేశారు.

ఇటీవల నగరంలో హిజ్రాలతో, చిన్నారులతో, మహిళల చేత భిక్షాటన(Beggars in Hyderabad) చేస్తున్న వారిపై పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సేవ పేరుతో జరుగుతున్న బెగ్గింగ్ మాఫియా ముఠా పోలీసులకు చిక్కింది. నిజామాబాద్ ఆర్మూర్​కి చెందిన గడ్డి గణేష్‌ ఎల్బీనగర్ మన్సూరాబాద్​లో అమ్మ చేయూత ఫౌండేషన్ పేరుతో 2019 లో ఓ సేవా సంస్థను ప్రారంభించాడు.

Hyderabad Taskforce Arrests Begging Racket : అనాథలకు సహయం చేస్తామని చేప్పి పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటామని చెప్పి.. ఆ ఫౌండేషన్ పేరుతో పలువురు నుంచి డబ్బులు వసూలు చేసేవాడు. ఇతనికి 2020లో నల్గొండకు చెందిన ఇద్దరు వ్యక్తులు పరిచయం అయ్యారు. ఇద్దరు అన్నదమ్ములు కేతావత్‌ రవి, కేతావత్‌ మంగు.. నగరంలో ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ఫౌండేషన్ పేరుతో బాక్సులు తయారు చేయించిస్తామని ఇందుకు ఒక్కో బాక్సుకు నెలకు 2వేలు ఇస్తామని తెలిపారు.

రవి, మంగు వారి ఇళ్ల సమీపంలో ఉన్న నిరుద్యోగ యువతులను రిక్రూట్ చేసుకున్నారు. వారిని నగరంలోని ప్రధాన కూడళ్ల వద్దకు నిందితులు వారి అటోలో తీసుకుని వెళ్తారు. ఈ యువతులు ఉదయం 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకూ ప్రజల వద్ద సాయం చేయమంటూ వేడుకుంటారు. తర్వాత బాక్సులో ఏ రోజు వచ్చిన డబ్బు ఆరోజు వారి ప్రాంతానికి వెళ్లి తాళాలు తీసి ఇద్దరు అన్నదమ్ములు సగం, బిక్షాటన చేసిన వారికి సగం తీసుకుంటున్నారు.

Begging Racket Busted in Hyderabad : ఇలా ఈ మూడేళ్లలోనే నేరగాళ్లు లక్షల్లో సంపాదించారు. వచ్చిన డబ్బుతో నగర శివారు ప్రాంతాలైన నాదర్‌గుల్‌, బడంగపేట్, తుర్కయాంజాల్‌ ప్రాంతాల్లో 90లక్షలు విలువ చేసే భూముల కొనుగోలు చేసినట్లు పోలీసులు(Telangana Police) తెలిపారు. ప్రత్యేక డ్రైవ్​లో భాగంగా నైరుతి మండల టాస్క్ ఫోర్స్, మలక్​పేట పోలీసులు పక్కా సమాచారంతో నిందితులను అరెస్ట్ చేశారు.

ఈ కేసులో ఏజెంట్లుగా ఉన్న ఇద్దరు అన్నదమ్ములు రవి, మంగు సహా సంస్థ నడుపుతున్న రవితో పాటు బిక్షాటన చేస్తున్న ఏడుగురు యువతులను పోలీసులు ఆరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 90లక్షలు విలువ చేసే స్తిరాస్తి డాక్యుమెంట్లు, 1.38లక్షల నగదు, 12 బిక్షాటన బాక్సులు, వాటిలో 13వేల నగదు, రెండు వేల విలువ చేసే నాణేలు, మూడు చరవాణిలు, ఐడికార్డులు, 8 వైట్ కోట్​లు, విజిటింగ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

"అమ్మ ఫౌండేషన్​ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నాము. అమ్మ ఫౌండేషన్​ ఛైర్మన్​ గణేశ్​తో పాటు కెతావత్​ రవి, మంగు.. మరో ఏడుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి లక్ష ఇరవై రెండు వేల నగదు, కోటి రూపాయల విలువ చేసే స్థిరాస్తి పత్రాలు, రెండు ఆటోలు, 12 కలెక్షన్​ బాక్సులను స్వాధీనం చేసుకున్నాము. ఇలా వీరు బెగ్గింగ్ దందాతో నాదర్​గుల్​, బడంగ్​పేట్​, తుర్కయాంజల్​లో 80 లక్షల విలువైన స్థలాలను కొనుగోలు చేశారు". - రూపేష్, సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ

Begging Mafia Arrest in Hyderabad ఆశ్రమాల పేరుతో బెగ్గింగ్ దందా.. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్​

వికృతంగా భిక్షాటన దందా.. పిల్లల్ని అద్దెకు తెచ్చుకొని.. మద్యం తాగించి..

పీజీ పట్టభద్రుడి భిక్షాటన.. ఎందుకో తెలుసా?

Last Updated : Aug 20, 2023, 8:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.