ETV Bharat / state

కేటీఆర్​ సవాల్​పై బండి సంజయ్ రియాక్షన్.. ఏమన్నారంటే..?

author img

By

Published : Dec 21, 2022, 12:47 PM IST

Updated : Dec 21, 2022, 2:33 PM IST

Bandi Sanjay
Bandi Sanjay

Bandi Sanjay Response to KTR Challenge: కేటీఆర్‌ సవాల్​కు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఏడాది క్రితం ఛాలెంజ్​ చేస్తే ఇప్పుడు స్పందిస్తారా అని ప్రశ్నించారు. డ్రగ్స్ కేసుపై నిలదీస్తే నలుగురిని పట్టుకుని మమ అనిపిస్తారని విమర్శించారు.

Bandi Sanjay Response to KTR Challenge : మంత్రి కేటీఆర్‌ సవాలుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. కల్వకుంట్ల కుటుంబ సభ్యులు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఎంపీ అర్వింద్​ను కవిత చెప్పుతో కొడతానని.. సీఎం కేసీఆర్‌ ముక్కలు చేస్తానని అన్న విషయాలను గుర్తు చేశారు. పొగాకు తింటానని తనపై ఆరోపణలు చేసినప్పుడు.. తాను సవాల్ విసిరినప్పుడు ఏమి చేశారని కేటీఆర్​ను ప్రశ్నించారు. డ్రగ్స్‌ కేసులో దొరక్కుండా ఉండేందుకు విదేశాల్లో చికిత్స తీసుకున్నారని ఆరోపించారు. ఇన్ని రోజులు కేటీఆర్ ఎక్కడికి వెళ్లారని నిలదీశారు.

హైదరాబాద్‌ డ్రగ్స్ కేసులో సిట్ విచారణ ఎందుకు ఆగిందని బండి సంజయ్ ప్రశ్నించారు. డ్రగ్స్ కేసుపై ప్రశ్నిస్తే నలుగురిని పట్టుకుని మమ అనిపిస్తారని విమర్శించారు. కేటీఆర్​ను ముఖ్యమంత్రి చేస్తారని అనుకుంటున్నారు.. కానీ ఆయన సీఎం కాకముందే చెప్పులతో కొడతానంటున్నారని మండిపడ్డారు. హైదరాబాద్, బెంగుళూరు డ్రగ్‌ కేసుపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కవిత లిక్కర్ స్కాంపై కేటీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని బండి సంజయ్ నిలదీశారు.

మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తే రజాకారుల పాలన పునరావృతం అవుతుందని బండి సంజయ్ ఆరోపించారు. వేములవాడకు రూ.100 కోట్లు ఇస్తానని కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. తీగలగుట్టపల్లి రైల్వే వంతెనకు రాష్ట్ర వాటా ఇవ్వాలని తెలిపారు. రూ.80 కోట్లు ఇస్తే పనులు వెంటనే ప్రారంభం అవుతాయని అన్నారు. గంగాధర రైల్వే పైవంతెనకూ నిధులు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కరీంనగర్​ కోసం చాలా చేస్తామని చెప్పారని.. అవన్నీ హామీలకే పరిమితమయ్యాయని మండిపడ్డారు.

అసలేం జరిగిదంటే: బండి సంజయ్ చేసిన డ్రగ్స్ ఆరోపణల పట్ల.. మంత్రి కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. డ్రగ్స్ వాడినట్లు తేలకపోతే కరీంనగర్ చౌరస్తాలో చెప్పు దెబ్బలకు సిద్ధమా అని సవాల్ విసిరారు. డ్రగ్స్ పరీక్షకు రక్తం ఇవ్వడానికి సిద్ధమన్న కేటీఆర్.. అవసరమైతే జుట్టు, గోర్లు, కిడ్నీ కూడా ఇస్తానని చెప్పారు. సెస్‌ ఎన్నికల్లో భాగంగా.. సిరిసిల్లలో మంత్రి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ లక్ష్యంగా.. తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఇవీ చదవండి: నేను డ్రగ్స్ తీసుకోలేదని తేలితే చెప్పుతో కొడతా.. సిద్ధమా?: బండికి కేటీఆర్‌ సవాల్‌

దిల్లీ లిక్కర్ స్కామ్​ .. ప్రతిపక్షాల ట్వీట్ వార్​కు కవిత స్ట్రాంగ్ కౌంటర్​

'భారత్​-చైనా సరిహద్దు సమస్యపై మౌనమెందుకు'.. పార్లమెంట్ ఎదుట విపక్షాల ఆందోళన

Last Updated :Dec 21, 2022, 2:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.