ETV Bharat / state

BALKA SUMAN: 'దళితులపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ'

author img

By

Published : Jun 28, 2021, 5:48 PM IST

దళితులపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించినట్లు ప్రభుత్వ విప్​ బాల్క సుమన్ (BALKA SUMAN)తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 11,500 దళిత కుటుంబాలకు రూ.12 వందల కోట్లు ఖర్చు పెడుతున్నామని వెల్లడించారు. దళిత సాధికారిత పథకాన్ని కొత్తగా ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

'దళితులపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ'
'దళితులపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ'

దళిత సాధికారిత పథకాన్ని కొత్తగా ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభించడం సంతోషంగా ఉందని ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్‌, గువ్వల బాలరాజు అన్నారు. ఆదివారం ప్రగతిభవన్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించినట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 11,500 దళిత కుటుంబాలకు రూ.12 వందల కోట్లు ఖర్చు పెడుతున్నామని బాల్క సుమన్​ వెల్లడించారు. అసెంబ్లీ ప్రాంగణంలోని తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో ప్రభుత్వ విప్‌లు మాట్లాడారు.

దళితులపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించినట్లు బాల్క సుమన్ తెలిపారు. భూములు లేని దళిత రైతులకూ రైతు బీమా అమలు చేయాలని సీఎం కేసీఆర్ గొప్ప నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ మేరకు దళిత కుటుంబాల సమగ్ర సర్వే చేసి లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు.

కేసీఆర్​ను దేవుడిలా చూస్తున్నారు..

రాష్ట్రమంతా సీఎం కేసీఆర్‌ను దేవుడిలా చూస్తోందని మరో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు తెలిపారు. కేసీఆర్​ మాదిరిగా ఏ ముఖ్యమంత్రులూ ఆలోచించలేదని అన్నారు. కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్‌, నోముల భగత్​లు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: Telangana: రూ.1,86,035.60 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.