ETV Bharat / state

కొకైన్ దొరికినా... ఒక్కరు కూడా అరెస్టు కాలేదు.. ఎందుకు?: అసదుద్దీన్

author img

By

Published : Apr 7, 2022, 11:54 AM IST

అసదుద్దీన్
అసదుద్దీన్

Hyderabad Pub Case: పుడింగ్ పబ్ కేసుపై మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఆ కేసులో యజమాని మినహా ఎవరినీ అరెస్టు చేయలేదని వ్యాఖ్యానించారు. పేదలు, ధనవంతులకు చట్టం సమానంగా వర్తించాలని అన్నారు.

Hyderabad Pub Case: హైదరాబాద్​ బంజారాహిల్స్ డ్రగ్స్ కేసులో యజమాని మినహా ఎవరినీ అరెస్ట్ చేయకపోవడం దురదృష్టకరమని మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. కేసు విషయమై ట్విటర్ వేదికగా ఆయన స్పందించారు. కొకైన్ దొరికినప్పటికీ ఎవరినీ అరెస్ట్ చేయకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ధనవంతుల పిల్లల్లో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకుండా విడుదల చేశారని అసద్ ఆరోపించారు. చట్టం అందరికీ సమానమేనన్న ఆయన... పేదలు, ధనవంతులందరికీ చట్టం సమానంగా ఉండాలని హితవు పలికారు. మంత్రి కేటీఆర్, హైదరాబాద్ పోలిస్ కమిషనర్​లను ట్యాగ్ చేశారు.

''పుడింగ్‌ పబ్‌ కేసులో యజమాని మినహా ఎవరినీ అరెస్టు చేయలేదు. ధనవంతుల పిల్లల్లో ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదు. కొకైన్ దొరికినా ఎవరినీ అరెస్టు చేయకపోవడం దురదృష్టకరం. పేదలు, ధనవంతులకు చట్టం సమానంగా వర్తించాలి.''

- అసదుద్దీన్, మజ్లిస్ అధ్యక్షుడు

  • Rule of law is supreme Art 13 & it is very unfortunate that cocaine was found in this “Rave party” and all offspring’s of Rich kids where released not a single arrest apart from the owner of the place
    Law should be applied equally to poor & rich @CPHydCity @KTRTRS https://t.co/WehHaS5BTK

    — Asaduddin Owaisi (@asadowaisi) April 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సంబంధిత కథనాలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.