ETV Bharat / state

Amaravati Padayatra: 23వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల పాదయాత్ర

author img

By

Published : Nov 23, 2021, 11:54 AM IST

Amaravati Padayatra
అమరావతి రైతుల పాదయాత్ర

(Amravati Farmers Maha Padayatra) అమరావతి రైతుల మహాపాదయాత్రఉద్ధృతంగా సాగుతోంది. అదే జోరు, అదే హుషారు. పోలీసు ఆంక్షలు, వర్షపు జల్లులు అడపాదడపా ఆటంకాలు కలిగించినా.. రైతులు ముందుకే సాగారు. నేడు కొండబిట్రగుంట నుంచి సున్నబట్టి వరకు యాత్ర కొనసాగనుంది.

(Amravati Farmers Maha Padayatra) అమరావతి రైతుల మహాపాదయాత్ర 23 వరోజుకు చేరుకుంది. ఇవాళ నెల్లూరు జిల్లా కొండబిట్రగుంట నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. సున్నంబట్టి వరకు 15 కిలోమీటర్లు యాత్ర పాదయాత్ర కొనసాగనుంది. 45 రోజుల పాటు కొనసాగనున్న ఈ యాత్ర డిసెంబర్ 15న తిరుమల చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు. నిన్న సీఎం జగన్ ప్రకటనతో ధ్వజమెత్తిన అన్నదాతలు...పాదయాత్రను మరింత ఉద్ధృతంగా ముందుకు సాగించారు. నిన్న 13 కిలోమీటర్ల మేర నడిచిన రైతులు... కొండబిట్రగుంట చేరుకున్నారు. ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించేవరకూ ఉద్యమం ఆగదని తేల్చిచెప్పారు.

Three Capitals Repeal Bill: ఏపీలో మూడు రాజధానుల చట్టంపై సోమవారం చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలపై రాజధాని రైతులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మెుదట రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకోవటాన్ని స్వాగతించిన రైతులు.. ఆ తరువాత మళ్లీ సమగ్రంగా వికేంద్రీకరణ చట్టాన్ని తీసుకువస్తామని ఆ రాష్ట్ర సీఎం జగన్ ప్రకటించటంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అవగాహన లోపం, మెుండి వైఖరితో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మూడు రాజధానులంటూ (Three Capitals For AP) ఏం చేస్తున్నారో, ఏం చేయబోతున్నారో ప్రభుత్వంలోని ఏ ఒక్కరికీ సరైన స్పష్టత లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లోనూ.. తాము పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అన్నట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో అన్నదాతలు మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా జగన్ ఇచ్చినప్పటి మాటకు కట్టుబడి ఉండాలని.. లేకుంటే ప్రజలు ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలివేస్తారని ధ్వజమెత్తారు.

అమరావతి రైతుల మహా పాదయాత్ర (Amaravathi farmers Padayatra) 23వ రోజుకు చేరింది. నెల్లూరు జిల్లా కొండబిట్రగుంట నుంచి ప్రారంభమైంది.

ఇదీ చదవండి: Amaravathi Farmers on AP CM: "ప్రజలు కూకటివేళ్లతో జగన్ సర్కారును పెకిలిస్తారు"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.