ETV Bharat / state

Actor Ali Meet AP CM YS Jagan : 'టికెట్ ఇచ్చినా వద్దని చెప్పా.. త్వరలోనే పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన'

author img

By

Published : Feb 15, 2022, 5:51 PM IST

Actor Ali Meet AP CM YS Jagan
Actor Ali Meet AP CM YS Jagan

Actor Ali Meet AP CM YS Jagan: వైఎస్‌ఆర్‌ సీఎం కాకముందు నుంచే వారి కుటుంబంతో పరిచయం ఉందని చెప్పారు సినీ నటుడు అలీ. ఇవాళ ఏపీ సీఎం జగన్​తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. సోమవారం సీఎంవో నుంచి పిలుపు వచ్చిందని.. అతి త్వరలోనే పార్టీ కార్యాలయం నుంచే ప్రకటన ఉంటుందంటూ వ్యాఖ్యానించారు.

Actor Ali Meet P CM YS Jagan : సినీనటుడు, వైకాపా నేత అలీ.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సోమవారం సీఎంవో నుంచి పిలుపు వచ్చిందని తెలిపారు. అతి త్వరలో పార్టీ కార్యాలయం నుంచే ప్రకటన ఉంటుందని వ్యాఖ్యానించారు. క్యాంపు కార్యాలయంలో పలువురు మంత్రులను కలిశానని వెల్లడించారు. ఏమీ ఆశించకుండానే పార్టీలోకి వచ్చానని.. పదవి ఇస్తేనే పార్టీలోకి వచ్చి సేవ చేస్తానని అనలేదని స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్‌ సీఎం కాకముందు నుంచే వారి కుటుంబంతో పరిచయం ఉందని చెప్పారు.

"2004లో వైఎస్‌ఆర్‌ పాదయాత్ర చేసిన తర్వాత కలిశాను. సీఎం జగన్‌తోనూ ముందు నుంచి పరిచయం ఉంది. ఇటీవల మా మ్యారేజ్‌ డే సందర్భంగా కలవాలని అనుకున్నాం. సీఎంకు అత్యవసర భేటీలు ఉండడం వల్ల కలవలేకపోయాం. సీఎంతో ఫోటో దిగాలని ఉందని నా భార్య ఎప్పటి నుంచో చెబుతోంది. ఇదే విషయం సీఎంతో చెబితే పర్లేదు తీసుకురమ్మన్నారు. గత ఎన్నికల్లో నాకు టికెట్‌ ఇస్తారని చెప్పడం వాస్తవం.రాజకీయాలకు సమయం కుదరదని నేనే వద్దని చెప్పా. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే క్షేత్రస్థాయిలో పట్టు ఉండాలి. ఒకసారి రాజకీయాల్లోకి వస్తే చిత్రీకరణలు పక్కన పెట్టాలి. సమయం కుదరకే గతంలో టికెట్‌ ఆఫర్‌ ఇచ్చినా రాలేకపోయా" - అలీ, సినీ నటుడు

రాజ్యసభ సీటు ఇస్తారని ప్రచారం..

గత సాధారణ ఎన్నికల ముందు వైకాపాలో చేరిన అలీ.. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ప్రచారం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చాక పదవిని ఆశిస్తోన్న ఆయనకు నిరాశే మిగిలింది. ఇటీవల సినీ ప్రముఖులతో పాటు సీఎం జగన్‌ను అలీ కలిశారు. వారం రోజుల్లో కలుద్దామంటూ అప్పట్లో ఆయనకు సీఎం చెప్పారు. అప్పట్నుంచి అలీకి వైకాపా తరఫున రాజ్యసభ సీటు ఇస్తారని విస్తృత ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో సీఎంతో అలీ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే పార్టీ కార్యాలయం నుంచే ప్రకటన ఉంటుందంటూ అలీ చేసిన వ్యాఖ్యలు.. ఆసక్తిని రేపుతున్నాయి.

'టికెట్ ఇచ్చినా వద్దని చెప్పా.. త్వరలోనే పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన'

ఇదీ చూడండి : భాజపాపై కేసీఆర్‌ పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన దేవెగౌడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.