ETV Bharat / state

'వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి.. రైతుల నిర్బంధాన్ని ఆపాలి'

author img

By

Published : Feb 27, 2021, 4:38 PM IST

Updated : Feb 27, 2021, 7:05 PM IST

వ్యవసాయ చట్టాలపై రాష్ట్ర ప్రభుత్వం తమ వైఖరి స్పష్టం చేయాలని రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది. చట్టాలను రద్దు చేయాలని, అన్నదాతల పోరాటంపై నిర్బంధాన్ని ఆపాలని కోరింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన తెలిపింది.

A united front of public associations staged a protest at the Sundarayya  vignana kendram demanding the repeal of agricultural laws
వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక నిరసన

కేంద్ర వ్యవసాయ చట్టాలపై రాష్ట్ర ప్రభుత్వం తమ వైఖరి స్పష్టం చేయాలని రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి టీ సాగర్ డిమాండ్ చేశారు. చట్టాలను రద్దు చేసే వరకు దశలవారీగా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. అన్నదాతల పోరాటంపై నిర్బంధాన్ని ఆపాలని పేర్కొన్నారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. జాతీయ స్థాయిలో అన్నదాతలు చేపట్టిన పోరాటానికి సంఘీభావంగా మార్చి 1 నుంచి పాదయాత్ర కార్యక్రమాలు విస్తృతం చేయనున్నట్లు వెల్లడించారు.

దేశాన్ని తాకట్టు పెట్టే సంస్కృతిని కొనసాగిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరి వీడే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి స్పష్టం చేశారు. నాడు స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమ స్ఫూర్తితో రైతులకు సంఘీభావంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షుడు లక్ష్మయ్య తెలిపారు.

ఇదీ చూడండి: పట్టభద్రుల పోరులో విజయమే లక్ష్యంగా భాజపా వ్యూహం

Last Updated :Feb 27, 2021, 7:05 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.