హైదరాబాద్​లో​ మరో అగ్ని ప్రమాదం.. గోదాంలో భారీగా ఎగసిపడిన మంటలు

author img

By

Published : Mar 13, 2023, 7:58 AM IST

Fire accident in Attapur
అత్తాపూర్​లో అగ్ని ప్రమాదం ()

Fire accident in Attapur: రాష్ట్ర రాజధానిలో మరో భారీ అగ్నిప్రమాదం కలకలం రేపింది. అత్తాపూర్‌ సమీపంలో కట్టెల గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు ప్రమాదం జరిగిన సమయంలో గోదాంలో ఎవరూ లేకపోవడంతో పెను ముప్పు తప్పింది. అగ్నిమాపక సిబ్బంది 8 శకటాలతో సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు.

హైదరాబాద్​లోని అత్తాపూర్‌ సమీపంలో కట్టెల గోదాంలో అగ్ని ప్రమాదం

Fire accident in Attapur: ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పుటికి వరుసగా హైదరాబాద్​లో అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన సికింద్రాబాద్‌ దక్కెన్‌ మాల్‌ అగ్నిప్రమాద ఘటన మరవక ముందే నగరంలో మరో భారీ అగ్నిప్రమాదం జరగడం సంచలనం సృష్టించింది. అత్తాపూర్‌ ప్రాంతంలోని నౌ నెంబర్‌ పహాడీ వద్ద కట్టెల గోదాంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గోదాంలో భారీగా కలప నిల్వ ఉండడంతో మంటలు ఎగిసిపడ్డాయి.

గోదాం నివాస ప్రాంతాల మధ్య ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద స్థలానికి సమీపంలో మదర్సా ఉండడంతో అప్రమత్తమైన పోలీసులు.. అక్కడున్న చిన్నారులతో పాటు పలువురిని బయటకు పంపించారు. కొన్ని ఇళ్లలోని స్థానికులను ఖాళీ చేయించారు. ముందు జాగ్రత్తగా విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. కట్టెల గోదాంను ఆనుకుని టింబర్‌ డిపో ఉండడంతో.. ఒక దశలో మంటలు వ్యాపిస్తాయేమోనని అధికారులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఎనిమిది అగ్నిమాపక శకటాలతో మంటలను నాలుగు గంటల పాటు శ్రమించి అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదం జరిగినప్పుడు ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణ నష్టం తప్పిందని పోలీసుల తెలిపారు. అయితే కట్టెల గోదాంకు అగ్నిమాపక ప్రమాణాల ప్రకారం ఎటువంటి అనుమతులు లేవని పోలీసులు గుర్తించారు. నివాస ప్రాంతాల మధ్య ఈ తరహా గోదాంల వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకు వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు. కట్టెల గోదాంలో ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. అనుమతులు లేని గోదాంలను నివాస ప్రాంతాల నుంచి తరలించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

అత్తాపూర్​ సమీపంలో కట్టెల గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. మాకు సమాచారం తెలియగానే ఇక్కడికి చేరుకొన్నాం. గొదాం సామర్థ్యం కంటే ఎక్కువ సరుకు నిల్వ ఉన్నది. అందువల్ల తీవ్రత ఎక్కువగా ఉంది. చుట్టుపక్కల మదర్సా గొదాంకు ఆనుకొని కట్టెల ఎక్కువ సాగు చేయడం అగ్గి వెనుక వాళ్లకి వ్యాపంచింది. ప్రస్తుతానికి ఎంత ఆస్తి నష్టం జరిగిందో స్పష్టంగా చెప్పలేం. కొంత సమయం తరవాత తెలుస్తుంది. పెద్ద ఎత్తున మంటలు వస్తున్నందున నీరు కొట్టిన నీరు ఆవిరి అయిపోతుంది. దీంతో ఈ అగ్గి అంత సులభంగా ఆరిపోదు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.