ETV Bharat / state

కేటీఆర్‌కు చిన్నోడి ట్వీట్... దిగొచ్చిన అధికార యంత్రాంగం

author img

By

Published : Nov 14, 2022, 4:12 PM IST

Ktr Respond on A child's tweet:నేడు బాలల దినోత్సవం... అందులోనూ సెలవు. ఇంకేముంది అందరు పిల్లలు ఎంజాయ్ చేస్తూ... ఇంట్లో గడుపుతారు. కానీ ఓ బుడ్డోడు మాత్రం అందుకు భిన్నంగా ప్రజా సమస్యలను తీర్చేశాడు. ఒకే ఒక్క ట్వీట్‌తో 5 ఏళ్ల సమస్యకు పరిష్కారం చూపించాడు. అదేంటో తెలుసుకోవాలని ఉందా... ఈ స్టోరీపై లుక్ వేయండి.

A child tweeted to KTR asking for drinking water and the minister responded
కేటీఆర్‌కు చిన్నోడి ట్వీట్... దిగొచ్చిన అధికార యంత్రాంగం

Ktr Respond on A child's tweet: మంత్రి కేటీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఏదైనా సమస్య అంటే... వెంటనే స్పందిస్తారు. అంతే కాదు ఎంత బిజీగా ఉన్నా... ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా... సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. కష్టాల్లో ఉన్నాను అంటూ ఎవరైనా ట్విటర్ వేదికగా ఓ ట్వీట్ చేసినా... వెంటనే వారికి తక్షణ సాయం అందిస్తారు. అయితే తాజాగా ఓ చిన్నోడు చేసిన పనికి మంత్రి కేటీఆర్ స్పందించాడు. వెంటనే అధికార యంత్రాంగం మొత్తం ఆ బుడ్డొడి ట్వీట్‌కు కదిలివచ్చింది. అసలు ఏం జరిగిందంటే...

హైదరాబాద్‌లోని గోల్డెన్ సిటీ కాలనికి గత 5 ఏళ్లుగా తాగునీరు అందడం లేదు. దీనితో అక్కడి వాసులు నానా అవస్థలు పడుతున్నారు. అయితే దీనిపై ఓ చిన్నోడు వీడియో తీసి మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు. ఆ వీడియోలో బాలల దినోత్సవం రోజు కేటీఆర్ అంకుల్‌కు విజ్ఞప్తి అంటూ... ఓ బోర్డ్ పట్టుకుని నిలబడ్డాడు ఉమర్. ''మా కాలనీకి 5 ఏళ్లుగా నీళ్లు అందడం లేదంటూ.. అందులో రాసి ఉంది. మేం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం... ప్లీజ్ అంకుల్ సాయం చేయండి.. అంటూ.. ఆ చిన్నోడు కేటీఆర్‌ను కోరాడు.

అయితే ట్వీట్‌ను చూసిన కేటీఆర్... వెంటనే స్పందించారు. అక్కడి కాలనీకి వెళ్లి సమస్య పరిష్కరించాలని జలమండలి ఎండీ దానకిషోర్‌కు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాలతో గోల్డెన్ సిటీ కాలనీకి జలమండలి ఎండీ దానకిశోర్ వెళ్లారు. చిన్నారి ఉమర్‌ను కలిశారు. ఆ కాలనీకి ఇప్పటికే తాగునీటి సరఫరా లైన్ కోసం 2.85 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపిన దాన కిశోర్.... వర్షాకాలం కారణంగా పైప్‌లైన్ పనులు ప్రారంభం కాలేదని వివరించారు. రెండు వారాల్లో కాలనీకి తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. అప్పటి వరకు ట్యాంకర్లతో కాలనీకి నీరు అందిస్తామన్న జలమండలి ఎండీ దాన కిశోర్ హామీ ఇచ్చారు.

అయితే ఈ బుడ్డోడి ప్రయత్నానికి కాలనీ వాసులు మెచ్చుకుంటున్నారు. 5 ఏళ్ల సమస్యని... ఒక్క ట్వీట్‌తో పరిష్కరించాడని ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో కూడా ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. బాలల దినోత్సవం నాడు... ఈ బుడ్డోడి ప్రయత్నానికి ప్రభుత్వమే దిగొచ్చిందని అంటున్నారు.

  • Sir,inspected & met Master Umar.2.85cr Rs waterline sanctioned to this area,didn’t start work be cause of monsoon road-cut ban by GHMC till October 31st & staring now. The waterline Master Umar’s house is 3.94 km/94 Lk Rs. Assured him of water sply in 2 weeks time @Patelshyd pic.twitter.com/Z4TYeyxw3h

    — Dana Kishore (@MDHMWSSB) November 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.