ETV Bharat / state

అంతర్గత విభేదాలు... బహిరంగ విమర్శలు

author img

By

Published : Jun 21, 2019, 6:46 AM IST

Updated : Jun 21, 2019, 7:46 AM IST

తెలంగాణ కాంగ్రెస్​లో మాటల యుద్ధం కొనసాగుతోంది. షోకాజ్ నోటీసులపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఉత్తమ్​కు నాయకత్వ లక్షణాలు లేవని, ఎన్నికల్లో ఓటమికి ఆయనే కారణమని, పీసీసీ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేస్తేనే పార్టీ బాగుపడుతుందని ధ్వ జమెత్తారు.

అంతర్గత విభేదాలు... బహిరంగ విమర్శలు


కాంగ్రెస్‌ పార్టీలో ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటి రెడ్డి సోదరుల మధ్య చాలాకాలంగా అంతర్గత విబేధాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తరువాత విబేధాలు మరింత ముదిరాయి. ఎన్నికల ముందు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌, రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి ఆర్​సీ కుంతియాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అప్పట్లో పీసీసీ క్రమశిక్షణా సంఘం ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చింది. కోమటిరెడ్డి సోదరులు పార్టీని వీడితే తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని భావించిన రాష్ట్ర నాయకత్వం రాజగోపాల్​ రెడ్డి ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందాల్సి వచ్చింది.

గెలిచిన సంతోషం కూడా లేకుండానే...

శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమాతో మిత్రపక్షాలను కలుపుకుని ముందుకు వెళ్లిన కాంగ్రెస్​కు తీవ్ర పరాభవం ఎదురైంది. కేవలం 19 మంది ఎమ్మెల్యేలతోనే సరిపెట్టుకుంది. తర్వాత పరిణామాల్లో 12 మంది శాసనసభ్యులు అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు సీనియర్‌ నేతలు లోకసభ ఎన్నికల ముందుకు భారతీయ జనతాపార్టీలో చేరారు. ఇలాంటి కష్టకాలంలోనూ మూడు పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకున్న సంతోషం కంటే పార్టీలో ఏర్పడిన అనిశ్చితి పరిస్థితులే నాయకత్వాన్ని కలవరపరిచాయి.

విమర్శలు... షోకాజులు

దెబ్బ మీద దెబ్బతో సతమతమవుతుండగా... ఈ నెల 15న నల్గొండలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజపాయే అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. దీన్ని తీవ్రంగా పరిగణించిన పీసీసీ క్రమశిక్షణ కమిటీ మరోసారి రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీలు ఇచ్చి, 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. వ్యక్తిగత కారణాలతోనే ఆయన పార్టీ మారుతున్నారని ఉత్తమ్ దిల్లీలో వివరణ ఇచ్చిన కాసేపటికే... రాజగోపాల్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఉత్తమ్ కుమార్ రెడ్డే కారణమని, ఆయనకు నాయకత్వ లక్షణాలు లేవని విమర్శించారు. ఆయన రాజీనామా చేస్తేనే పార్టీ బాగుపడుతుందన్నారు. కష్టకాలంలో పార్టీని ఆదుకున్న తమకు షోకాజ్ ఇచ్చే అర్హత కాంగ్రెస్​కు లేదని ధ్వజమెత్తారు. ప్రజాక్షేత్రంలో గెలవలేని వి. హనుమంత రావు లాంటి వారు కూడా తమపై విమర్షలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

అంతర్గత విభేదాలు... బహిరంగ విమర్శలు

ఇదీ చూడండి:మహత్తర ఘట్టానికి ఘనమైన ఏర్పాట్లు

Date: 20.06.2019 Hyd_tg_84_20_Komatireddy Rajgopal Reddy_Ab_C4 Contributer: k.lingaswamy Area : lb nagar నోట్ : ఫీడ్ ఎప్టిపి లో పంపించానైనది గమనించి వాడుకోగలరు. రంగారెడ్డి జిల్లా : కాంగ్రెస్ పార్టీ నాయకత్వలోపాల కారణంగానే ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందిందని, ఓటమితోనైనా కనులు తెరుస్తుందనుకుంటే అది జరగలేదని, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంపై మండిపడ్డాడు. గురువారం సాయంత్రం పెద్ద అంబర్పేట్లోని ఓ ఫంక్షన్ హాల్ లో ఆయన పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సమావేశం ఆరంభంలో వేదిక పైకి రావాలంటూ కోరినా చౌటుప్పల్ ఎంపిపి తాడూర్ వెంకటరెడ్డి తన అనుచరులతో వెళ్లిపోయారు. రాజగోపాల్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు తాను కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క ల వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పానని, అక్షరాల అదే జరిగిందన్నారు. దాదాపు 50 మంది ఇది ఓటమి చెందే నాయకులకు టికెట్లు కేటాయించారని తెలిపారు. కేసీఆర్ ను ఎదుర్కొనే దమ్ము శక్తి కాంగ్రెస్ నాయకత్వానికి లేదన్నారు. ప్రస్తుతం గెలిచిన 19 మందిలో 12 మంది తెరాసలోకి చేరారని వారు సైతం కాంగ్రెస్ నాయకత్వానికి లోపాలున్నాయని చెబుతున్నారన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేని దౌర్భాగ్యం స్థితిలో కాంగ్రెస్ ఉందన్నారు. రాష్ట్రంలో ఇంతటి విపత్కర పరిస్థితులు ఉన్న కాంగ్రెస్ అధిష్టానం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత కార్యకర్తలు తమను ఎమ్మెల్యేగా గెలిపించారని భువనగిరి నుంచి ఎంపీగా సోదరుడు వెంకట్ రెడ్డి ని గెలిపించారని, ఇందులో పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి మినహా కాంగ్రెస్ పార్టీ నాయకత్వ ఉద్దరించింది ఏమీ లేదని అన్నారు. కెసిఆర్ తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఆర్థికంగా దెబ్బకోట్టాలని చుసారన్నారు. ఈ క్రమంలో 30 ఏళ్ల క్రితం ప్రారంభమై 5000 మంది ఉద్యోగులకు భోజనం పెడుతున్న సుశి ఇన్ ఫాస్ట్ ను భూస్థాపితం చేయించారన్నారు. తన కుటుంబంలో సభ్యుడిగా కొనసాగిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పార్టీ మారేలా చేశారని తెలిపారు. మిగతా ఎమ్మెల్యే లుగా తాను కెసిఆర్ కు కాళ్ల వద్ద ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాలా... పోరాటం చేయాలా... అంటూ ప్రశ్నించుకున్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎలాగో తనకు అండగా లేదని అందుకే కెసిఆర్ పై పోరాటానికి సిద్ధమైనట్లు తెలిపారు. తెరాస కు ప్రత్యామ్నాయంగా భాజపా ఒక్కటేనని తనకు తాను రక్షించుకుంటూ తనము నమ్ముకున్న వారిని రక్షించేందుకు ఇలాంటి నిర్ణయం తిసుకున్నానని తెలిపారు. ఈ క్రమంలో ప్రతి ఒక్క కార్యకర్త తన వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పాలన్నారు. ఏ పార్టీలో ఉన్న అందరికీ అందుబాటులో ఉంటానని పార్టీలకతీతంగా తనకు సహకరించాలని కోరారు. కార్యకర్తలకు ఎలాంటి బలవంతం లేదని తెలిపారు. బైట్ : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (ఎమ్మెల్యే మునుగోడు)
Last Updated :Jun 21, 2019, 7:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.