Minister Satyavathi Ratod: 'ఆ నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించు రామయ్య'

author img

By

Published : Sep 12, 2021, 3:27 PM IST

minister-satyavathi-ratod-interesting-comments-on-opposition-leaders

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని మంత్రి సత్యవతి రాఠోడ్, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భద్రాచలంలో జరిగిన మండల కమిటీ ఎన్నికల సమావేశంలో మంత్రి, ఎంపీ పాల్గొన్నారు.

'అలా మాట్లాడే నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించు రామయ్య'

ముఖ్యమంత్రి కేసీఆర్​ ఏడేళ్ల పాలనలో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని మంత్రి సత్యవతి రాఠోడ్, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత దర్శించుకున్నారు. నేతలకు.. ఆలయ ఈవో శివాజీ పూలమాలలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీ తయారు అమ్మవారి ఉపాలయంలో నేతలకు అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. శాలువాతో సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందించారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్​కు, మంత్రి కేటీఆర్​కు భద్రాద్రి రామయ్య శక్తినివ్వాలని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిని చూడలేక అవాక్కులు చెవాక్కులు పేలుతున్న నాయకులకు మంచి బుద్ధిని, అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇవ్వాలని సీతారాములను కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం భద్రాచలంలో జరిగిన మండల కమిటీ ఎన్నికల సమావేశంలో మంత్రి, ఎంపీ పాల్గొన్నారు.

అర్థం చేసుకునే జ్ఞానమివ్వు...

" ఏడేళ్ల కాలంలోనే రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలకంటే మిన్నగా అభివృద్ధి చేసి.. వాటి ఫలాలను ప్రజలకు అందజేస్తున్నాం. 24 గంటల నాణ్యమైన కరెంటు, రైతు బంధు, మిషన్​ భగీరథ, కాళేశ్వరం వంటి పథకాలతో.. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాం. మనల్ని చూసి మిగతా రాష్ట్రాలు నేర్చుకునే స్థాయికి ముఖ్యమంత్రి కేసీఆర్​ పాలన సాగుతోంది. ఈ విషయాలేమీ అర్థచేసుకోలేని కొందరు చోటామోటా నాయకులు కేసీఆర్​ మీద అవాక్కులు చెవాక్కులు పేలుతున్నారు. వాళ్లకు మంచి బుద్ధిని ఆ రామయ్య ప్రసాదించాలి. అర్థంచేసుకునే జ్ఞానాన్ని ఇవ్వాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తోన్న సీఎం కేసీఆర్​కు, తెరాస వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ను మరింత శక్తినివ్వాలి." - సత్యవతిరాఠోడ్​, మంత్రి.

ఇదీ చూడండి:

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.