ETV Bharat / state

కరోనా నుంచి అందర్ని రక్షించాలని ప్రార్థించా: ఇంద్రకరణ్

author img

By

Published : Apr 2, 2020, 10:49 AM IST

కొవిడ్​-19 వైరస్​ బారి నుంచి ప్రజలందరినీ రక్షించాలని రామయ్యను ప్రార్థించినట్లు మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి తెలిపారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రజలందరూ స్వీయనియంత్రణ పాటించాలని కోరారు.

minister indrakaran reddy
కరోనా బారి నుంచి ప్రజలందరిని రక్షించాలని ప్రార్థించా: మంత్రి

కరోనా బారి నుంచి ప్రజలందరినీ రక్షించాలని సీతారామచంద్రులను కోరినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో స్వామివారిని దర్శించుకున్నారు. కొవిడ్​-19 ప్రభావంతో అతి కొద్ది మంది సమక్షంలోనే వేడుకలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు.

కరోనా బారి నుంచి ప్రజలందరిని రక్షించాలని ప్రార్థించా: మంత్రి

ఇవీచూడండి: నేడే భద్రాద్రి రామయ్య కల్యాణం.. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.