ETV Bharat / state

వరుణుడి ప్రతాపంతో సింగరేణిలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

author img

By

Published : Aug 17, 2020, 1:25 PM IST

సింగరేణి సంస్థకు కరోనా నాటి నుంచి కష్టాలు తప్పడం లేదు. పలు ప్రాంతాల్లో పేరుకుపోయిన బొగ్గు నిల్వలతో ఒకవైపు ఇబ్బందులు పడుతున్న సింగరేణి సంస్థకు వర్షాల రూపంలో మరో ఇబ్బందులు ఎదురయ్యాయి.

Coal production stopped  in Singareni
వరుణుడి ప్రతాపంతో సింగరేణిలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షం కారణంగా గత ఐదు రోజులుగా ఇల్లందు, కోయగూడెం ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఇల్లందు నుంచి 10వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, కోయగూడెం ఉపరితల గని నుంచి 7 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి.. వర్షం కారణంగా నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు.

ఈ రెండు ఉపరితల గనులు కావడం వల్ల ఓవర్​ బర్డెన్​ పనులు సైతం వర్షం కారణంగా నిలిచిపోయాయి. మరోవైపు కరోనా నాటి నుంచి బొగ్గు కొనుగోలు సరిగ్గా లేకపోవడం వల్ల భారీగా ఇల్లందు ఏరియాలో నిల్వలు పేరుకుపోయాయి. సోమవారం 1800 టన్నుల బొగ్గు ఎగుమతి మాత్రమే జరిగినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: భారత్​ సత్తా: జాబిల్లిపై ఇళ్ల నిర్మాణానికి అంతరిక్ష ఇటుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.