ETV Bharat / state

Adilabad RIMS : ఆ ఆసుపత్రిలో సదుపాయాలు మెండు.. కానీ వైద్యులే కరవు!

author img

By

Published : Jul 5, 2023, 9:41 AM IST

Etv Bharat
Etv Bharat

Problems in Adilabad RIMS : ఆదిలాబాద్​లో కోట్ల రూపాయలు వెచ్చించి.. ఆధునిక పరికరాలతో ఆసుపత్రిని నిర్మించారు. దాన్ని ప్రారంభించి ఏడాదిన్నర అవుతున్న అక్కడ వైద్యుల కొరతతో సరైన చికిత్స అందించలేకపోతున్నారు. ఇంత పెద్ద ఆసుపత్రి నిర్మించి వైద్యం కోసం హైదరాబాద్​, నాగ్​పూర్​ పంపిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. మరోవైపు ఆసుపత్రిలో వైద్యుల భర్తీ కోసం ప్రభుత్వానికి నివేదిక సమర్పించామని అధికారులు తెలిపారు.

కోట్ల రూపాయలతో కట్టిన ఆసుపత్రి కానీ అక్కడ వైద్యులుండరు

Lack Of Staff in Adilabad RIMS : అద్భుతమైన భవన సముదాయం. కోట్లాది రూపాయల ఆధునిక పరికరాలు. ఔరా అనిపించే పరిసరాలు. వాస్తవంగా ఆ వాతావరణమే ఆనారోగ్యంతో ఉన్న రోగికి స్వాంతన చేకూరుస్తుంది. కానీ అందులో కీలకమైన వైద్యులు లేరు. ఓ రకంగా చెప్పాలంటే వైద్యుల్లేని ఆసుపత్రి అంటే నమ్మితీరాల్సిందే. పోనీ అదేదో ప్రాథమిక ఆరోగ్యకేంద్రమో, డిస్పెన్సరీనో అనుకుంటే పొరపాటే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏకంగా రూ.150 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పరిస్థితి. అనుమానం ఉంటే ఆదిలాబాద్‌ వెళ్లి చూడాల్సిందే.

Problems in Adilabad RIMS : ఇదే ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ వైద్యకళాశాలకు అనుబంధంగా.. రూ.150 కోట్ల వ్యయంతో నిర్మించిన సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి. తెలంగాణలో విసిరేసినట్లుండే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో.. వైద్యసేవలను మెరుగుపర్చేందకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఆసుపత్రిని 2022 మార్చినెలలో.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖామంత్రి హరీశ్​రావు ప్రారంభించడంతో.. తమ ఆరోగ్యాలకు ఉపశమనం కలుగుతుందని పేద ప్రజలు ఆశపడ్డారు.

ఆసుపత్రి ప్రారంభం కంటే ముందే ప్రభుత్వం.. గుండె, నరాలు, రేడియాలజీ, మూత్రపిండాలు, మత్తు, క్యాన్సర్‌, పిల్లలు, ఎముకలు, గైనకాలజీ విభాగాలకు కలిపి మొత్తం 11 విభాగలకు గాను 52 వైద్యపోస్టులను మంజూరు చేసింది. ఏడాదిన్నర కాలం కావస్తున్న కేవలం మత్తు, పిల్లల వైద్యులు కలిపి 6 పోస్టులే భర్తీకాగా మరో 46 వైద్యపోస్టులు భర్తీకాక.. వైద్యుల్లేని ఆసుపత్రిగా మిగిలిపోయింది.

రిమ్స్‌ వైద్యకళాశాలలో నయం కాని వ్యాధులను.. సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలో కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఆపత్కాలంలో ఆధునిక వైద్యం అందించాల్సి ఉన్నప్పటికి మంజూరుచేసిన పోస్టుల్లో ప్రభుత్వం వైద్యులను నియమించకపోవడంతో పేదల ఆరోగ్యానికి అవరోధంగా మారుతోంది. పేదలకు వైద్యం అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"ఆసుపత్రి పారంభించి దాదాపు ఏడాదిన్నర అవుతున్న సరైన వైద్యులు లేకపోవడం చాలా బాధాకరం. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇంత మంచి ఆసుపత్రి కట్టించారు. కానీ ఏమీ ఉపయోగం లేదు. ఇక్కడికి వైద్యం కోసం వచ్చినా హైదరాబాద్​, మహారాష్ట్ర పంపిస్తున్నారు." -స్థానికులు

Problems in Adilabad RIMS : కార్పొరేట్‌స్థాయి ఆసుపత్రి అయినందుకు కనీసం వారానికోసారైన.. గుండె, మూత్ర పిండాల వ్యాధులను పరీక్షించే వైద్య నిపుణులను భర్తీ చేస్తే పేదలకు ఎంతోమేలు చేసినట్లవుతుంది. అలాంటి ప్రయత్నం కూడా జరగడంలేదు. సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యపోస్టుల ఖాళీలున్నాయని అంగీకరిస్తున్న అధికారులు.. ప్రభుత్వానికి నివేదించామనే మాటలతో కాలం వెళ్లదీస్తున్నారు.

" సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రిలో 52 పోస్టులు ఉన్నాయి. అందులో 6మంది ఇక్కడ ఉన్నారు. ఇంకా 46మంది భర్తీ కావాల్సి ఉంది. వివిధ విభాగాల డాక్టర్ల భర్తీ కోసం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాము. తొందర్లోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. "-డా. జైసింగ్‌, రిమ్స్‌ వైద్యకళాశాల డైరెక్టర్

సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యపోస్టులను భర్తీ చేయించే విషయంలో.. జిల్లా ప్రజాప్రతినిధుల లోపం స్పష్టంగా ఉంది. భవన నిర్మాణానికి మేం నిధులు మంజూరు చేశామని ప్రకటించుకునే స్థానిక బీఆర్​ఎస్​కు చెందిన ఎమ్మెల్యేలు.. బీజేపీ ఎంపీ ఉన్నప్పటికి వైద్య పోస్టుల భర్తీపై దృష్టిసారించడంలేదు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.