ETV Bharat / state

Inspirational Story of Young Handicapped Zakeer Pasha : అంగవైకల్యాన్ని అధిగమించి.. ప్రముఖులను మెప్పిస్తున్న యువకుడు

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2023, 10:25 PM IST

Special Story On Zakeer Pasha
inspirational story of young handicapped

Inspirational Story of Young Handicapped Zakeer Pasha : పుట్టుకతోనే రెండు చేతులు లేవు. కానీ అధైర్యపడలేదు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందుకు సాగాడు. ఏనాడూ అవిటితనాన్ని తలుచుకుని బాధపడలేదు. అందరికంటే ఎక్కువ కష్టపడే అదృష్టం దక్కిందని గర్వంగా అనుకున్నాడు. కాళ్లతోనే రకరకాల ఆర్ట్స్ వేయడం ప్రారంభించాడు . ఇప్పటికే చాలామంది ప్రముఖుల బొమ్మలేసి ప్రశంసలు పొందుతున్నాడు. మరి, ఇంతకీ ఆ యువకుడు ఎవరు..? తెలుసుకోవాలని ఉందా..!! కాళ్లతోనే పనులు చేసుకుంటూ ప్రముఖులను మెప్పిస్తున్న యువకుడి కథ ఇది

Inspirational Story of Young Handicapped Zakeer Pasha :మానవ జీవన శైలిలో చేతులది ప్రధాన పాత్ర. కానీ పుట్టుకతోనే రెండు చేతులు లేకుంటే ఆ జీవితం ఎలా ఉంటుందో ఉహించడమే నరకం. అలాంటి స్థితినే అధిగమించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాడు ఈ యువకుడు. చేతులు లేకున్నా... తన పనులు తాను చేసుకుంటూ, చిత్ర కళలో రాణిస్తూ సామాజిక కార్యక్రమాల్లో సైతం చురుగ్గా పాల్గొంటూ అంగవైకల్యానికే సవాల్ విసురుతున్నాడు.

ఈ యువకుడి పేరు జాకీర్ పాషా కుమురంభీం జిల్లా కాగజ్ నగర్ చెందిన షేక్ బాషా, మెహరాజ్ బేగం దంపతులకు నలుగురు సంతానం. పెద్దవాడు జాకీర్ పాషా కాగా ముగ్గురు ఆడపిల్లలు. జాకీర్​కు పుట్టుకతోనే 2 చేతులు లేవు. కుమారుడి పరిస్థితి చూసి మొదట్లో బాధ పడ్డా తర్వాత ధైర్యం తెచ్చుకుని అన్నీ నేర్పించడం మొదలు పెట్టారు తల్లిదండ్రులు. M.com చదివిన జాకీర్.. చిత్రాలు వేస్తూ తవ ప్రతిభ కనబరుస్తున్నాడు.

ఆ సమయంలో స్మోకింగ్​ చేస్తే.. పిల్లల్లో అంగవైకల్యం వస్తుందా?

చేతులు లేకున్నా.. కాళ్లతోనే చిత్రాలు గీస్తూ ఔరా అనిపిస్తున్నాడు జకీర్. కాళ్లతోనే అన్ని పనులు చేస్తున్నాడు. సిస్టమ్ ఆపరేటింగ్​తో పాటు చదువులో భాగంగా అనేక విషయాలు నేర్చుకున్నాడు. చిన్నప్పటి నుంచి తోటివారితో సమానంగా ఉండాలనే ఆలోచించేవాడు. అందుకోసం చాలా పోటీల్లో పాల్గొనేవాడినని చెబుతున్న జకీర్ వైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదంటాడు.

'' నాకు పుట్టుకతోటే రెండు చేతులు లేవు. నేను ఎంతో కష్టపడి చదివి పీజీ పూర్తిచేశాను. నేను అన్ని పనులు చేతులతోనే చేస్తాను. స్కూటీ డ్రైవింగ్, కంప్యూటర్ ఆపరేటింగ్, చిత్రాలు కూడా కాలుతోనే వేస్తాను. గత ఎన్నికల్లో కాళ్లతోటే ఓటు హక్కును వినియోగించుకున్నాను.అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రత్యేకంగా నన్ను అభినందించారు.రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్​ని స్వీకరించి కాళ్లతోనే మొక్కలు నాటడంతో ఆయన చాలా ఆనందించారు.మానవ జన్మ దేవుడిచ్చిన గొప్పవరం నేను చేతులు లేకుండానే పట్టుదలతో అన్ని సాదిస్తున్నాను. మీకు దేవుడు అన్ని ఇచ్చాడు కాబట్టి బాగా చదవండి.''-జాకీర్ పాషా, కాగజ్​నగర్

గత ఎన్నికల్లో కాళ్లతోనే ఓటు హక్కు వినియోగించుకోవడంతో అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్​ని స్వీకరించి కాళ్లతోనే మొక్కలు నాటాడు. తనవంతు సామాజిక బాధ్యతకు ముందుంటున్నాడు. ఇతడి గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్నమంత్రి కేటీఆర్ జాకీర్​కు ఉపాధి కల్పించాలని జిల్లా పాలనాధికారికి సూచించారు.

మానవ జన్మ దేవుడిచ్చిన గొప్పవరం అంటాడు యువకుడు. కష్టాలు వస్తేనే జీవితం పరిపూర్ణం అవుతుందని చెబుతున్నాడు. కష్టాల్ని ఎదుర్కునేందుకు ఎల్లప్పుడు సిద్ధంగా ఉండాలని... కుటుంబాన్ని పోషించుకోగలిగేలా ఎదగాలని అనుకుంటున్నాడు.

ఆటో నడుపుతూ కుటుంబాన్ని సాకుతున్నానని.. దివ్యాంగుడైన కుమారుడికి ప్రభుత్వం సహకారం అందించాలని కోరుతున్నాడు జాకీర్ తండ్రి షేక్ బాషా. ప్రభుత్వం పలుమార్లు ఉపాధి.. అవకాశాలు కల్పించే ప్రయత్నం చేసినా... ఉద్యోగమే కావాలంటున్నాడు ఈ యువకుడు.

Physically challenged people: వారి సంకల్పం ముందు.. అంగవైకల్యం చిన్నబోయింది

అంగవైకల్యం అడ్డుకాదని.. కాళ్లనే చేతులుగా మార్చుకుని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.