ETV Bharat / state

నిర్మాణాలు పూర్తయ్యాయి కానీ... నివాసానికి మాత్రం నోచుకోవట్లే

author img

By

Published : Aug 9, 2020, 11:45 AM IST

double-bed-rooms-incomplete-in-adilabad-district
నిర్మణాలు పూర్తయ్యాయి కానీ... నివాసానికి మాత్రం నోచుకోవట్లే

పేదల సొంతింటి కల... కలగానే మిగులుతోంది. స్థలంతో పాటు రెండు పడక గదుల ఇళ్లను కట్టిస్తామన్న ప్రభుత్వ ఆశయం ఏళ్లుగా ఆదిలాబాద్‌ జిల్లాలో నెరవేరడంలేదు. కనీసం పూర్తైన ఇళ్లను ఇవ్వకపోవడం వల్ల అవి నిరుపయోగంగా పడి ఉన్నాయి.

తెలంగాణ ఏర్పడ్డాక ఆదిలాబాద్‌ జిల్లాలో రెండు పడక గదుల ఇళ్ల మంజూరు ప్రారంభమైంది. నిర్మాణ పనులను మూడు శాఖలకు అప్పగించారు. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్‌ విభాగానికీ, గిరిజన ప్రాంతాల్లో ఐటీడీఏ ఇంజనీరింగ్‌ విభాగానికి, ఆదిలాబాద్‌లో రోడ్లు భవనాల శాఖకు పనులు కేటాయించారు.

పూర్తిదశకు చేరుకున్న...

మొత్తం 4 వేల195 ఇళ్లు మంజూరుకాగా.. వాటిలో 3 వేల154 ఇళ్ల నిర్మాణాలకు టెండర్లు పూర్తై పనులు మొదలయ్యాయి. కొన్ని చోట్ల పనులు పూర్తిదశకు చేరుకున్నాయి. అసంపూర్తిగా ఉన్న ఇళ్లలో కొంతమంది నివాసముంటుండగా.. కట్టిన ఇళ్లు కూలిపోయే స్థితికి వస్తున్నా ఇవ్వడం లేదంటూ మరి కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిర్లక్ష్యమే...

ప్రస్తుతం 15 వందలకుపైగా ఇళ్ల నిర్మాణం పూర్తైనట్లుగా అధికారులు చెబుతున్నారు. తలుపులు, కిటికీలు, విద్యుత్‌, తాగునీరు, మురికి కాలువలు, రహదారి వంటి పనులు పూర్తిచేస్తే... లబ్ధిదారులు ఉండేందుకు వీలుంటుందని తెలిపారు. గుత్తేదార్ల నిర్లక్ష్యంతో కట్టిన నిర్మాణాలు నిరుపయోగంగా ఉంటున్నాయి. కొన్నిచోట్ల నాణ్యత లోపంతో గోడలు కూలీపోయే స్థితికి చేరుకుంటున్నాయి. పోటీపడి ఇళ్లు మంజూరు చేయించుకున్న ప్రజాప్రతినిధులు పనులు పూర్తిచేయడంపై దృష్టిపెట్టడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికైనా పనుల్లో వేగం పెంచి లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల కేటాయింపునకు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

ఇవీ చూడండి: జూరాలకు పోటెత్తిన కృష్ణమ్మ... కొనసాగుతోన్న గోదావరి జలాల ఎత్తిపోత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.