ETV Bharat / sports

హాకీలో స్వర్ణం గెలిస్తే ఒక్కొక్కరికి రెండు కోట్ల నజరానా

author img

By

Published : Jul 30, 2021, 8:30 PM IST

Punjab govt announces Rs 2.25 crore each for state's hockey players
హాకీ టీంకు భారీ నజరానా

టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్​ క్రీడల్లో భారత హాకీ జట్టు స్వర్ణం సాధిస్తే పంజాబ్​ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులకు ఒక్కొక్కరికి రూ. 2.25 కోట్లు ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అక్కడి క్రీడాశాఖ మంత్రి రాణా గూర్మీత్​ సింగ్​ సోధీ నజరానాపై స్పష్టతనిచ్చారు.

టోక్యో ఒలింపిక్స్​లో భారత హాకీ జట్టు బంగారు పతకం గెలిస్తే టీమ్​లోని తమ ప్లేయర్లకు ఒక్కొక్కరికి రూ. 2.25కోట్ల నజరానా ఇస్తామని పంజాబ్​ క్రీడామంత్రి రాణా గుర్మీత్ సింగ్ సోధి శుక్రవారం ప్రకటించారు. గతంలో హాకీ టీమ్ బంగారు పతకం సాధిస్తే మొత్తం జట్టుకు రూ. 2.25 కోట్లు ఇస్తామని పంజాబ్​ ప్రభుత్వం ప్రకటించింది. అయితే తాజాగా ఆ మొత్తాన్ని ఒక్కొక్క ప్లేయర్​కు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు.

పంజాబ్ భవన్‌లో జరిగిన యూత్ డెవలప్‌మెంట్ బోర్డు సమావేశానికి హాజరైన రాణాసోధి మీడియాతో మాట్లాడారు. పంజాబ్​ నుంచి ఉన్న మొత్తం 20 మంది ఆటగాళ్లలో.. హకీ టీమ్ఇండియాలో 11 మంది టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్​ క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారని ఆయన అన్నారు. అందుకుగానూ వారిని అభినందించారు. ఈ ఒలింపిక్స్​లో కనీసం భారత్​కు 3 నుంచి 4 పతాకాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: ఒలింపిక్స్​లో సింధు రికార్డు.. తొలి క్రీడాకారిణిగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.