ETV Bharat / sports

Tokyo Olympics Live: రవి దహియాకు రజతం.. పునియా ఓటమి

author img

By

Published : Aug 5, 2021, 7:24 AM IST

Updated : Aug 5, 2021, 6:03 PM IST

.
.

16:58 August 05

పునియాకు నిరాశ..

ఒలింపిక్స్‌ రెజ్లింగ్​ 86 కిలోల విభాగంలో భారత్‌కు నిరాశ ఎదురైంది. కాంస్యం సాధిస్తాడనుకున్న రెజ్లర్​ దీపక్​ పునియా.. కాంస్య పతక పోరులో 2-4తేడాతో ఓటమి పాలయ్యాడు. 

16:31 August 05

రవి దహియాకు రజతం..

ఒలింపిక్స్​లో భారత్​ రజత పతకం సాధించింది. పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్​ విభాగంలో.. రెజ్లర్​ రవి దహియా ఫైనల్లో 4-7 తేడాతో ఓడిపోయాడు. ఈ ఒలింపిక్స్​లో భారత పతకాల సంఖ్య ఐదుకు చేరింది.

హరియాణా ప్రోత్సాహకం..

రజతం సాధించిన రవి దహియాకు హరియాణా ప్రభుత్వం ప్రోత్సాహకం ప్రకటించింది. ముందుగా ప్రకటించినట్లుగానే రజత పతక విజేతకు ఇచ్చే రూ. 4 కోట్లు దహియాకు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. ఇంకా ప్రభుత్వ ఉద్యోగం, హరియాణాలో కోరిన చోట భూమి, అతడి స్వగ్రామం నాహ్రీలో రెజ్లింగ్​ కోసం ఇండోర్​ స్టేడియం నిర్మిస్తామని హామీ ఇచ్చింది.  

15:45 August 05

ఫొగాట్​కు నో ఛాన్స్​..

మహిళల రెజ్లింగ్​ 53 కేజీల విభాగం ఫ్రీస్టైల్​లో భారత స్టార్​ రెజ్లర్​ వినేశ్​ ఫొగాట్​కు నిరాశ. రెపిచేజ్​ రౌండ్​లో ఆడే అవకాశం కోల్పోయింది. క్వార్టర్​ ఫైనల్లో వినేశ్​ను ఓడించిన వనీసా(బెలారస్​) ఫైనల్​కు చేరుకోలేకపోయింది. ఆమె ఫైనల్​కు చేరితే.. కాంస్య పతకం కోసం మ్యాచ్​ ఆడే అవకాశం వినేశ్​కు దక్కేది.

అంతకుముందు ప్రీక్వార్టర్స్​లో నెగ్గిన వినేశ్​.. క్వార్టర్​ ఫైనల్లో ఓడి ఒలింపిక్స్​ నుంచి నిష్క్రమించింది. 

15:28 August 05

  • Haryana | Wrestler Ravi Kumar Dahiya's family members in Sonipat cheer for him ahead of his men's freestyle (57kg) final later today

    "The country has faith that he'll win gold. There's a festive atmosphere here. He'll bring glory to country," says Rakesh Dahiya, Ravi's father pic.twitter.com/wCl4h0EB0o

    — ANI (@ANI) August 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'దహియానే గెలుస్తాడు..'

దహియా ఇంటి ముందు పండగ వాతావరణం నెలకొంది. మరికొద్దిసేపట్లో రెజ్లింగ్​ ఫ్రీస్టైల్​ 57 కేజీల విభాగం ఫైనల్లో పోటీపడనున్నాడు రవి కుమార్​ దహియా. అతడికి ఆల్​ ది బెస్ట్​ చెబుతూ.. దహియా ఇంటి వద్దకు చాలా మంది చేరారు. దేశం గర్వించేలా దహియా.. బంగారు పతకం సాధిస్తాడని ధీమాగా చెబుతున్నాడు అతడి తండ్రి రాకేశ్​ దహియా.

14:51 August 05

20 కి.మీ.ల రేస్​

పురుషుల 20 కి.మీ.ల రేస్​ వాక్​​లో స్టానో మాసిమో(ఇటలీ) విజేతగా నిలిచాడు. ఆ తర్వాతి రెండు స్థానాల్లో ఇకెడా కోకి(జపాన్​), యమనీషి తోచికాజు(జపాన్​) ఉన్నారు. ఈ పోటీలో భారత్​కు ప్రాతినిధ్యం వహించిన సందీప్​ కుమార్​ 23వ ర్యాంకుకు పరిమితం కాగా.. రాహుల్​ రోహిల్లాకు 47వ ర్యాంకు, కేటీ ఇర్ఫాన్​ 51వ స్థానంలో నిలిచారు. 

09:12 August 05

వినేశ్ ఫొగాట్ ఓటమి

భారత రెజ్లర్​ వినేశ్​ పొగాట్​ 53కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్లో ఓటమిపాలైంది. బెలారస్ క్రీడాకారిణి వనేసా చేతిలో పరాజయం చెందింది. ఒకవేళ వనేసా ఫైనల్ చేరితో వినేశ్​కు రెపిచేజ్ రౌండ్​లో పోటీపడే వీలుంటుంది.

08:54 August 05

టీమ్ఇండియాకు కాంస్యం

టోక్యో ఒలింపిక్స్​లో భారత హాకీ జట్టు అదరగొట్టింది. కాంస్య పతక పోరులో జర్మనీపై 5-4 గోల్స్ తేడాతో గెలిచి పతకం ఖాయం చేసుకుంది. దీంతో 41 ఏళ్ల తర్వాత భారత్​ హాకీ జట్టుకు విశ్వక్రీడల్లో పతకం దక్కింది.

08:24 August 05

అన్షు మాలిక్​ను నిరాశ

మహిళల 57 కేజీల ఫ్రీ స్టైల్​ రెజ్లింగ్​ విభాగంలో అన్షు మాలిక్ రెపిచేజ్​ రౌండ్​లో ఓటమి పాలైంది. రష్యన్ ఒలింపిక్స్ కమిటీ క్రీడాకారిణి వలెరియా కొబ్లోవా చేతిలో పరాజయం చెందింది. దీంతో పతకం సాధించకుండానే వెనుదిరిగింది.

08:19 August 05

ఆధిక్యంలో భారత్

పురుషుల హాకీ కాంస్య పతక పోరులో టీమ్ఇండియా ఆధిపత్యం కొనసాగిస్తోంది. మూడో క్వార్టర్ ముగిసే సమయానికి జర్మనీపై 5-3 గోల్స్​ తేడాతో ఆధిక్యంలో నిలిచింది.

08:09 August 05

క్వార్టర్స్​కు ఫొగాట్

భారత రెజ్లర్​ వినేశ్​ పొగాట్​ 53కేజీల విభాగంలో క్వార్టర్​ ఫైనల్​కు చేరుకుంది. గ్రూప్ స్టేజ్ మ్యాచ్​లో స్వీడన్​ క్రీడాకారిణి సోఫియాపై 7-1 తేడాతో విజయం సాధించింది. క్వార్టర్స్ మ్యాచ్​ 8.56 నిమిషాలకు ప్రారంభంకానుంది.

07:42 August 05

పోటాపోటీగా గోల్స్

టోక్యో ఒలింపిక్స్​లో భారత్-జర్మనీ మధ్య కాంస్య పతక పోరు హోరాహోరీగా సాగుతోంది. మొదటి క్వార్టర్​లో జర్మనీ ఒక గోల్​తో ఆధిక్యంలో ఉండగా.. రెండో క్వార్టర్​లో ఇరుజట్లు పోటాపోటీగా గోల్స్ సాధించాయి. దీంతో సగం ఆట పూర్తయ్యే సరికి 3-3 గోల్స్​తో సమంగా నిలిచాయి ఇరుజట్లు.

07:09 August 05

దూకుడుగా జర్మనీ

భారత్-జర్మనీ మధ్య జరుగుతోన్న హాకీ కాంస్య పతక పోరు మ్యాచ్​లో జర్మనీ దూకుడుగా ఆడుతోంది. ప్రస్తుతం మొదటి క్వార్టర్ ముగిసే సమయానికి జర్మనీ 1-0 గోల్స్​ తేడాతో ఆధిక్యంలో ఉంది.

07:04 August 05

Tokyo Olympics Live: భారత్​కు మరో పతకం.. రవిదహియాకు రజతం

కాంస్యంపై గురి

ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్​ పైనల్​కు చేరడంలో విఫలమైంది భారత పురుషుల హాకీ జట్టు. సెమీస్​లో బెల్జియం చేతిలో ఓడి అభిమానుల్ని నిరాశకు గురిచేసింది. అయితే కాంస్య పతకం మాత్రం టీమ్ఇండియాను ఊరిస్తోంది. నేడు జర్మనీతో జరుగుతోన్న మ్యాచ్​లో విజయం సాధిస్తే కనీసం కాంస్యమైనా దక్కుతుంది.

Last Updated : Aug 5, 2021, 6:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.