ETV Bharat / sports

Tokyo paralympics: స్వర్ణం కోసం ఇద్దరు.. కాంస్య పోటీలో ఇద్దరు

author img

By

Published : Sep 4, 2021, 9:37 AM IST

paralympics
పారాలింపిక్స్​

టోక్యో పారాలింపిక్స్​ బ్యాడ్మింటన్​ సింగిల్స్​లో ప్రమోద్​ భగత్​, యతిరాజ్​ సుహాస్​ స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. ఇక సెమీస్​లో ఓడిన సర్కార్​ మనోజ్​, తరుణ్​ కాంస్య పోరుకు సిద్ధమవ్వనున్నారు.

టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో రెండు పతకాలు ఖాయమయ్యాయి. ప్రపంచ నెంబర్​వన్ ప్రమోద్‌ భగత్‌, యతిరాజ్​ సుహాస్.. శనివారం జరిగిన​ బ్యాడ్మింటన్‌ సింగిల్స్​లో ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌3, ఎస్​ఎల్​4 విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనబరిచారు.

సెమీస్‌లో జపాన్‌కు చెందిన పుజిహారాపై 21-11,21-16తేడాతో ప్రమోద్‌ విజయం సాధించగా.. ఫ్రెడీ సెతియావాన్​పై 21-9,21-15తేడాతో యతిరాజ్​ గెలుపొందాడు. ఈ విజయంతో వీరిద్దరూ కనీసం రజతాన్ని ఖాయం చేసుకున్నారు. ఇక పైనల్​లో(స్వర్ణ పోరు) గెలిస్తే గోల్డ్​ మెడల్​ సొంతమవుతుంది.

ప్రమోద్​ స్వర్ణ పోరు ఈరోజు(సెప్టెంబరు 4) మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభమవనుండగా.. యతిరాజ్​ సెప్టెంబరు 5న ఆడనున్నాడు.

కాంస్య పోరు

శనివారం జరిగిన సెమీస్​లో ఆడిన మరో ఇద్దరు భారత అథ్లెట్లు సర్కార్​ మనోజ్​, తరుణ్​ ఓడిపోయారు. మనోజ్​ను డేనియల్​ 8-21,10-21తేడాతో మట్టికరిపించగా.. తరుణ్​ 21-16,16-21,21-18తేడాతో ఓటమి పాలయ్యాడు. దీంతో వీరు కాంస్య పోరుకు సిద్ధమవ్వనున్నారు.

వీరిలో మనోజ్​ కాంస్య పోరు నేటి(సెప్టెంబరు 4) మధ్యాహ్నం జరగనుండగా.. తరుణ్​ సెప్టెంబరు 5న ఆడతాడు.

ఇదీ చూడండి: Tokyo Paralympics: పారాలింపిక్స్‌లో లవ్‌ ప్రపోజల్‌ సీన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.