ETV Bharat / sports

'భారత్​-పాక్​ మ్యాచ్​.. అలా జరిగితేనే ఫుల్​ మజా'

author img

By

Published : Oct 28, 2021, 7:03 PM IST

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup 2021) పాకిస్థాన్​ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. తొలుత భారత్​ను(IND vs PAK T20) ఓడించిన పాక్.. న్యూజిలాండ్​పైనా(PAK vs NZ T20) విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మాట్లాడిన పాక్​ దిగ్గజం సక్లైన్ ముస్తాక్(Saqlain Mushtaq Coach).. ఫైనల్​లో భారత్, పాక్​ తలపడాలని ఆశించారు.

Saqlain Mushtaq
సక్లైన్ ముస్తాక్

టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021) ఫైనల్లో టీమ్​ఇండియా, పాకిస్థాన్ తలపడితే.. అది చాలా గొప్ప విషయమవుతుందని పాకిస్థాన్ దిగ్గజం సక్లైన్ ముస్తాక్(Saqlain Mushtaq Coach) అభిప్రాయపడ్డాడు. తుది పోరులో ఈ రెండు జట్లు ఆడితేనే అభిమానులు మరింత సంతోషిస్తారని అన్నాడు. ​ఇటీవల జరిగిన తమ తొలి మ్యాచ్​ల్లో ఇరు జట్లూ స్నేహభావాన్ని ప్రదర్శించడంపై ప్రశంసలు కురిపించాడు.

"టీమ్​ఇండియా ఫైనల్​కు అర్హత సాధిస్తే బాగుంటుంది. పాకిస్థాన్​ ఆ జట్టును ఓడించింది అని ఇలా చెప్పడం లేదు. భారత జట్టు చాలా దృఢంగా ఉంది. చాలా మందికి ఫేవరెట్ జట్టు కూడా. మరో మ్యాచ్​ భారత్, పాక్​ ఆడితే ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడే అవకాశాలున్నాయి."

--సక్లైన్ ముస్తాక్, పాకిస్థాన్ జట్టు కోచ్.

తొలి మ్యాచ్​ అనంతరం.. విరాట్​ కోహ్లీ, ధోనీ పాక్​ ఆటగాళ్లతో మాట్లాడి క్రీడా స్ఫూర్తిని చాటారని సక్లైన్(Saqlain Mushtaq News) అన్నాడు. భారత్​, పాక్​ మధ్య మ్యాచ్​ను ఓ గేమ్​లాగానే చూడాలని, ఇరు జట్లు మంచి బంధాన్ని కొనసాగించాలని సూచించాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు కూడా టీ20 ప్రపంచకప్​లో గట్టి పోటీ ఇస్తాయని అభిప్రాయపడ్డాడు.

టీ20 ప్రపంచకప్​లో భాగంగా శుక్రవారం(అక్టోబర్​ 29) అప్ఘానిస్థాన్​తో తలపడనుంది పాక్​. కాగా.. ఆదివారం(అక్టోబర్ 31) న్యూజిలాండ్​తో(IND vs NZ T20) మ్యాచ్​ ఆడనుంది భారత్.

ఇదీ చదవండి:

T20 worldcup: 'భారత్​-న్యూజిలాండ్​ మ్యాచ్​ను అలా చూడొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.