ETV Bharat / sports

టీమ్ఇండియా బ్యాటింగ్ ఆర్డర్​లో మార్పులు.. మాజీల విమర్శలు!

author img

By

Published : Nov 1, 2021, 9:47 AM IST

టీ20 ప్రపంచకప్​లో భాగంగా న్యూజిలాండ్​(ind vs nz t20)తో జరిగిన మ్యాచ్​లో ఓటమిపాలైంది టీమ్ఇండియా. టోర్నీలో వరుసగా రెండో ఓటమితో సెమీస్ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది. ఈ నేపథ్యంలో స్పందించిన మాజీలు.. భారత జట్టు ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

india
భారత్

టీ20 ప్రపంచకప్​లో రెండు వరుస ఓటములతో అభిమానుల్ని నిరాశకు గురిచేసింది టీమ్ఇండియా. తొలి మ్యాచ్​లో దాయాది పాక్​ చేతిలో ఓడిన కోహ్లీసేన(ind vs pak t20) రెండో మ్యాచ్​లో న్యూజిలాండ్(ind vs nz t20)​కు అప్పనంగా విజయాన్ని కట్టబెట్టింది. ఈ రెండు మ్యాచ్​ల్లోనూ అటు బ్యాట్​తో పాటు బంతితోనూ సమష్టిగా విఫలమయ్యారు భారత ఆటగాళ్లు. అయితే ఈ మ్యాచ్​లో కోహ్లీసేన చేసిన కొన్ని మార్పులు బెడిసికొట్టాయి. దీంతో ఒక్క మ్యాచ్ ఓటమితోనే జట్టులో మార్పులు ఎందుకు చేశారంటూ కొందరు ప్రశ్నిస్తుండగా.. మరికొందరు బ్యాటింగ్ ఆర్డర్​ను మార్చడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా కివీస్​పై భారత్ ఓడిన అనంతరం ఎవరేమన్నారో చూద్దాం.

  • ఏ రకమైన ఆలోచనా దృక్పథంతో టీమ్ఇండియా ఆడుతుందో అర్థం కావట్లేదు. రోహిత్​ను 3వ స్థానంలో దించడమేంటి? ఇషాన్ ఓపెనర్​గా రావాల్సిన అవసరం ఏంటి? హార్దిక్ పాండ్యా చాలా ఆలస్యంగా బౌలింగ్ చేశాడు. అతడు తొలి ఓవర్లలో బౌలింగ్ చేస్తే బాగుండేది. భారత్ గేమ్ ప్లాన్ ఏంటో అంతుచిక్కడం లేదు. భారత బౌలింగ్ దళం బలహీనంగా ఉందని మరోసారి రుజువైంది - షోయబ్ అక్తర్, పాక్ మాజీ క్రికెటర్
  • ఈ మ్యాచ్ క్వార్టర్ ఫైనల్​తో సమానం. జట్టు మానసికంగా దృఢంగా కనిపించడం లేదు. ఇలాంటి మ్యాచ్​ల్లో గెలవాలనే కసితో వెళ్లి తప్పులు చేయొద్దు. ద్వైపాక్షిక సిరీస్​ల్లో పొరపాట్లు దొర్లుతాయి. కానీ ప్రపంచకప్ లాంటి టోర్నీలో తప్పులు జరగకూడదు. - గంభీర్, భారత మాజీ క్రికెటర్
  • మ్యాచ్ మొదలవకముందే న్యూజిలాండ్.. భారత్​పై ఆధిపత్యం వహించింది. టాస్​కు ముందే టీమ్ఇండియా ఒత్తిడిలో కూరుకుపోయిందని ఎంచుకున్న జట్టును బట్టి చెప్పవచ్చు. రాహుల్, ఇషాన్ ఓపెనర్లుగా రావడం ఆశ్చర్యపరిచింది. అలాగే రోహిత్ మూడు, కోహ్లీ నాలుగో స్థానాల్లో రావడమూ ఆశ్చర్యమే. టాపార్డర్​లో ఉత్తమ ఆటగాళ్లు ఉండాలి. ఎందుకంటే టీ20ల్లో కేవలం 120 బంతులు మాత్రమే ఉంటాయి. -అజయ్ జడేజా, భారత మాజీ క్రికెటర్
  • బ్యాటింగ్ ఆర్డర్​లో భారత జట్టు చేసిన మార్పులు ఫలితాన్నివ్వలేదు. అద్భుత ఆటగాడైన రోహిత్​ను మూడో స్థానంలో దించారు. మూడో స్థానంలో విలువైన పరుగులు చేసే కోహ్లీ నాలుగులో దిగాడు. యువ ఆటగాడైన ఇషాన్ కిషన్​ను ఓపెనర్​గా పంపారు. ఇషాన్​ హిట్ అండ్ మిస్ ప్లేయర్. అతిడిని 4 లేదా 5లో పంపొచ్చు. అప్పుడు పరిస్థితిని బట్టి అతడు ఆడతాడు. రోహిత్​ను 3లో పంపడం వల్ల అతడి ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. మార్పులు ఫలితాన్ని ఇస్తే బాగుండేది. కానీ విఫలమైనపుడు విమర్శలు తప్పవు. -గావస్కర్, భారత మాజీ ఆటగాడు
  • రోహిత్​ లాంటి ఆటగాడి బ్యాటింగ్ ఆర్డర్ మార్చడం చాలా తప్పు. చాలా ఏళ్లుగా అతడు ఓపెనర్​గా సేవలందిస్తున్నాడు. దీని వల్ల జట్టు బ్యాటింగ్ ఆర్డర్​లో చాలా మార్పులు చేయాల్సి వచ్చింది. -మదన్​లాల్, భారత మాజీ ఆటగాడు

ఇవీ చూడండి: టీమ్ఇండియా సెమీస్ అవకాశాలు చేజారినట్లేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.