ETV Bharat / sports

T20 World Cup: టోర్నీకి బంగ్లాదేశ్ ఆల్​రౌండర్ షకిబ్ దూరం

author img

By

Published : Oct 31, 2021, 10:21 PM IST

టీ20 ప్రపంచకప్(T20 World Cup)​ టోర్నీకి దూరమయ్యాడు బంగ్లాదేశ్ ఆల్​రౌండర్ షకిబ్ అల్ హసన్(shakib al hasan news). తొడ కండరాల గాయం కారణంగా అతడు టోర్నీ నుంచి తప్పుకున్నట్లు సమాచారం.

shakib al hasan
షకిబ్ అల్ హసన్

బంగ్లాదేశ్ ఆల్​రౌండర్ షకిబ్ అల్ హసన్(shakib al hasan news) టీ20 ప్రపంచకప్​ టోర్నీకి దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్​కు ముందే హసన్​కు గాయం కావడం బంగ్లా జట్టుకు పెద్ద దెబ్బే. అయితే.. తొడ కండరాల్లో స్వల్ప చీలిక ఏర్పడిన కారణంగా షకిబ్ టోర్నీకి(T20 World Cup) దూరమైనట్లు తెలుస్తోంది.

"షకిబ్​కు తొడకండరాల్లో గాయమైంది. ఏ గ్రేడ్​ గాయమనేది స్కానింగ్ రిపోర్ట్స్​ అనంతరం స్పష్టమవుతుంది. ప్రస్తుతం టోర్నీ నుంచి అతడు తప్పుకుంటున్నాడు." అని క్రికెట్ వర్గాలు తెలిపాయి.

సూపర్​ 12 పోటీల్లో బంగ్లాదేశ్​ మూడు మ్యాచ్​లు ఆడింది. ఒక్క మ్యాచ్​లోనూ విజయం సాధించలేదు. అయితే.. గాయం కారణంగా షకిబ్ దూరమవడం బంగ్లా జట్టుకు తీరని లోటే. ఇటీవలే ఆ జట్టుకు చెందిన మహమ్మద్ సైఫుద్దీన్ నడుం నొప్పి కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. అతడి స్థానంలో రుబెల్ జట్టులోకి వచ్చాడు. ప్రస్తుతం షకిబ్​ స్థానంలో ఎవరు ఆడుతారనేది తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి:

IND vs NZ T20: టాస్​ గెలిచిన న్యూజిలాండ్.. టీమ్​ఇండియా బ్యాటింగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.