ETV Bharat / sports

Kohli Daughter: కోహ్లీ కుమార్తెకు అత్యాచార బెదిరింపులు!

author img

By

Published : Nov 1, 2021, 9:12 PM IST

టీ20 ప్రపంచకప్​లో (T20 World Cup 2021) రెండు వరుస ఓటములతో ఇప్పటికే ఎన్నో విమర్శలను మూటగట్టుకుంది టీమ్​ఇండియా. సామాజిక మాధ్యమాల్లో భారత క్రికెటర్లపై దారుణ ట్రోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో మరింత నీచానికి ఒడిగట్టారు కొందరు దుండగులు. కెప్టెన్ విరాట్​ కోహ్లీని (Virat Kohli News) దూషించడం సహా అతడి కూతురికి (Virat Kohli Daughter Threats) అత్యాచార బెదిరింపులకు పాల్పడతున్నారు.

Kohli Daughter
Kohli Daughter

టీమ్​ఇండియా (Team India News) ఓటమి పాలైనప్పుడు అభిమానులు.. నిరాశ చెందడం, బాధపడటం, కొన్ని సార్లు విమర్శించడం సాధారణమే. కీలకమైన ఐసీసీ ఈవెంట్లలో ఓడినప్పుడు వారి ఇళ్లపైకి రాళ్లు విసరడంలాంటి మితిమీరిన పనులూ చేస్తుంటారు కొందరు. అయితే టీ20 ప్రపంచకప్​లో టీమ్​ఇండియా పేలవ ప్రదర్శన నేపథ్యంలో మరింతగా దిగజారారు.

పాకిస్థాన్​, న్యూజిలాండ్​ చేతుల్లో ఓటమిని సహించలేని కొందరు సామాజిక మాధ్యమాల్లో టీమ్​ఇండియా క్రికెటర్లపై దారుణ ట్రోలింగ్​కు (Team India Trolled) పాల్పడుతున్నారు. ప్రధానంగా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ (Virat Kohli News), పేసర్ మహ్మద్​ షమిని (Mohammed Shami Trolls) అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. మత విద్వేషాన్ని ఎదుర్కొంటున్న షమికి కోహ్లీ అండగా నిలవడమే అందుకు కారణం.

Kohli Daughter
వామికతో అనుష్క

అంతటితో ఆగకుండా కోహ్లీ భార్య, నటి అనుష్క శర్మ సహా వారి కూతురు వామికను (Virat Kohli Daughter Threats) కూడా ఇందులోకి లాగుతున్నారు. చిన్నారి ఫొటోను విడుదల చేయాలని, ఆమెపై అత్యాచారానికి పాల్పడతామంటూ హేయమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

భారత జట్టు పేలవ ప్రదర్శనకు గతంలో ఏ సంబంధం లేకుండా అనుష్కను ట్రోల్​ చేసేవారు. ఇప్పుడు మానవత్వాన్ని మంటగలిపేలా, అన్ని హద్దులూ దాటుతూ అభం శుభం తెలియని చిన్నారిపై అసభ్య వ్యాఖ్యలు చేయడం వారిలోని పశుతత్వాన్ని చాటుతోందంటూ పలువురు పలువురు సోషల్ మీడియా యూజర్లు మండిపడుతున్నారు. ఇలాంటి బెదిరింపులను అరికట్టేలా కఠిన చట్టాలు తెచ్చి, అలాంటి దుష్టులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Kohli Daughter
కూతురితో కోహ్లీ దంపతులు

గతేడాది ఐపీఎల్​లో కోల్​కతా నైట్​రైడర్స్​ చేతిలో చెన్నైసూపర్​ కింగ్స్​ ఓటమి పాలైన సందర్భంలో ఎంఎస్​ ధోనీ కూతురు జీవాకు ఇలాంటి బెదిరింపులే ఎదురయ్యాయి.

ఇదీ చూడండి: T20 World Cup: 'వాళ్లేం రోబోలు కాదు'- టీమ్​ఇండియాకు పీటర్సన్​ మద్దతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.