ETV Bharat / sports

'తప్పులపై దృష్టిసారించి గెలవడానికి ప్రయత్నిస్తాం'

author img

By

Published : Nov 14, 2021, 2:15 PM IST

Williamson
విలియమ్సన్‌

టీ20 ప్రపంచకప్‌(t20 worldc cup final)లో ఆస్ట్రేలియాతో తలపడే ఫైనల్‌ తమకు సాధారణ మ్యాచ్‌లాంటిదని న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌(kane williamson news) అన్నాడు. తుదిపోరుకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో అతడు మాట్లాడాడు.

టీ20 ప్రపంచకప్​ ఫైనల్(t20 worldc cup final) మ్యాచ్​ రంగం సిద్ధమైంది. ఆస్ట్రేలియాతో జరిగే ఈ పోరులో ఎలాగైనా గెలిచి విశ్వవిజేతగా నిలవాలని గట్టి పట్టుదలతో ఉంది న్యూజిలాండ్. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన కివీస్ కెప్టెన్ విలియమ్సన్(kane williamson news).. ఫైనల్ పోరు(t20 worldc cup final) కూడా తమకు సాధారణ మ్యాచ్​లాంటిదని తెలిపాడు.

"ఇది మా కష్టానికి ప్రతిఫలం. ఆస్ట్రేలియాతో ఫైనల్‌ (t20 worldc cup final) అంటే ఒక సాధారణ మ్యాచ్‌ లాంటిదే. ఫైనల్లో చిన్న చిన్న విషయాలపై దృష్టి సారించి, గెలవడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు మా జట్టు కలిసికట్టుగా ఆడుతోంది. ప్రతి మ్యాచ్‌లోనూ ఏదో ఒకటి నేర్చుకోవడం మాకు ముఖ్యమైన విషయం. ఫైనల్‌(t20 worldc cup final) మ్యాచ్‌ కూడా మాకో అవకాశంగానే భావిస్తాం."

-విలియమ్సన్‌, న్యూజిలాండ్ కెప్టెన్

ఇక సెమీఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌(eng vs nz t20)తో జరిగిన కీలక పోరులో 46 పరుగులతో జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించిన డెవాన్‌ కాన్వే(devon conway news) గాయం కారణంగా తుదిపోరుకు అందుబాటులో లేని విషయంపై స్పందించాడు విలియమ్సన్. "డెవాన్‌ కాన్వే లేకపోవడం మా జట్టుకు పెద్దలోటు. అతడు మాకు అన్ని ఫార్మాట్లలో కీలక ఆటగాడు. ఫైనల్లో ఆడకపోవడం నిరాశ కలిగించింది. ఇలా జరగడం దురదృష్టకరం. అయినా, విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నాం. ఇక మా పొరుగు దేశంతో ఫైనల్‌ మ్యాచ్ ఆడటం గొప్పగా ఉంది. ఇది రెండు జట్లకూ నూతనోత్తేజం కలిగిస్తుంది. ఇది మాకు జట్టుగా ముందుకెళ్లడానికి మరో అవకాశం అని భావిస్తున్నా" అని న్యూజిలాండ్‌ కెప్టెన్‌ చెప్పుకొచ్చాడు.

కాగా, 2015 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో(t20 worldc cup final) ఇరు జట్లూ తలపడగా.. అప్పుడు ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. దీంతో ఈసారి ఎలాగైనా విజయం సాధించి ప్రతికారం తీర్చుకోవాలని న్యూజిలాండ్‌ భావిస్తోంది.

ఇవీ చూడండి: AUS vs NZ Final: ఈ రికార్డులపై ఓ లుక్కేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.