ETV Bharat / sports

'ఆ​ అథ్లెట్లకు టీకా ఇవ్వడమే తొలి ప్రాధాన్యత'

author img

By

Published : Jan 22, 2021, 8:33 PM IST

టోక్యో ఒలింపిక్స్​లో పాల్గొననున్న అథ్లెట్లకు ముందుగా టీకా ఇవ్వడమే తమ ప్రాధాన్యత అని అన్నారు భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నరీందర్ బత్రా. అందుకోసం తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.

Vaccination of Olympic-bound athletes our top priority: IOA chief Batra
'ఒలింపిక్​ అథ్లెట్లకు టీకానే తొలి ప్రాధాన్యత'

ఒలింపిక్స్​లో పాల్గొనే అథ్లెట్లకు టీకా ఇవ్వడమే తమ అత్యున్నత ప్రాధాన్యత అని అన్నారు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బత్రా. అందుకు అనుగుణంగా త్వరలోనే ఓ ప్రణాళిక రచించి, అమలు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.

"ఒలింపిక్స్​కు వెళ్లే అథ్లెట్లకు వ్యాక్సినేషన్​ ఇవ్వడమే మా తొలి ప్రాధాన్యత. అందుకోసం తీవ్రంగా కృషి చేస్తున్నాం. ఇప్పటికే వైద్యారోగ్య, క్రీడా మంత్రిత్వ శాఖలు, జాతీయ మాదకద్రవ్య నిరోధక సంస్థ (నాడా) సహ సంబంధిత విభాగాలతో చర్చలు జరుపుతున్నాం. సరైన ప్రణాళికను త్వరలోనే రూపొందిస్తాం."

-నరీందర్ బత్రా, ఐఓఏ అధ్యక్షుడు

వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఒలింపిక్ అథ్లెట్లకు ప్రాధాన్యత ఇస్తామని గతంలో కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.

టొక్యోలో జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. కరోనా నేపథ్యంలో క్రీడల నిర్వహణపై అనుమానాలు నెలకొన్నా.. ఎట్టిపరిస్థితుల్లోనైనా ఒలింపిక్స్​ను నిర్వహిస్తామని జపాన్ ప్రధాని సుగా సహ అంతర్జాతీయ ఒలింపిక్స్​ సంఘం తేల్చిచెప్పాయి.

ఇదీ చూడండి: 'ఒలింపిక్స్​ కచ్చితంగా నిర్వహిస్తాం.. మరో ఆలోచన లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.