ETV Bharat / sports

Tokyo Paralympics: అవనికి కాంస్యం.. 12కు చేరిన భారత పతకాలు

author img

By

Published : Sep 3, 2021, 11:02 AM IST

Updated : Sep 3, 2021, 11:50 AM IST

Avani Lekhara
అవని

10:57 September 03

Tokyo Paralympics: అవని రికార్డు కాంస్యం.. 12కు చేరిన భారత పతకాలు

  • More glory at the Tokyo #Paralympics. Elated by the stupendous performance of @AvaniLekhara. Congratulations to her on bringing home the Bronze medal. Wishing her the very best for her future endeavours. #Praise4Para

    — Narendra Modi (@narendramodi) September 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

జపాన్​ టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్​లో భారత పతకాల సంఖ్య 12కు చేరింది. మహిళల షూటింగ్​ ఆర్​8 50మీ. రైఫిల్​ 3పీ విభాగంలో.. అవని లేఖరా కాంస్యం సాధించింది. అంతకుముందు ఈమె.. ఆర్​2 10 మీ. ఎయిర్​ రైఫిల్​ విభాగంలో బంగారు పతకం సాధించడం విశేషం. దీంతో పారాలింపిక్స్​లో రెండు పతకాలు సాధించిన మొదటి భారత మహిళా క్రీడాకారణిగా రికార్డుకెక్కింది.

మోదీ ప్రశంసలు

టోక్యో పారాలింపిక్స్​లో స్వర్ణంతో పాటు కాంస్యం సాధించిన అవని లేఖరాపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. "పారాలింపిక్స్​కు మరింత కళ వచ్చింది. అవని లేఖరా ప్రదర్శన చూసి సంతోషం వేస్తోంది. కాంస్య పతకం సాధించినందుకు శుభాకాంక్షలు. భవిష్యత్​లో మరిన్ని పతకాలు సాధించాలని కోరుకుంటున్నా" అంటూ ట్వీట్ చేశారు.

Last Updated :Sep 3, 2021, 11:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.