ETV Bharat / sports

ఆష్లే బార్టీ షాకింగ్ నిర్ణయం.. 25ఏళ్లకే రిటైర్మెంట్

author img

By

Published : Mar 23, 2022, 10:02 AM IST

Updated : Mar 23, 2022, 10:33 AM IST

Ashleigh Barty Retires: ప్రపంచ ఛాంపియన్, టెన్నిస్ నెంబర్ వన్ ర్యాంకర్ ఆష్లే బార్టీ.. ఆటకు వీడ్కోలు పలికింది. 25 ఏళ్లకే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుంది.

Ashleigh Barty Retires At 25
Ashleigh Barty Retires At 25

Ashleigh Barty Retires: మహిళల టెన్నిస్ ప్రపంచ నంబర్‌ వన్ ర్యాంకర్‌ ఆష్లే బార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. 25 ఏళ్ల టెన్నిస్‌ క్రీడాకారిణి బార్టీ ప్రొఫెషనల్‌ ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించింది. రిటైర్‌మెంట్‌పై సోషల్‌ మీడియా వేదికగా ఓ వీడియోను ఆమె పోస్టు చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన బార్టీ మూడు గ్రాండ్‌స్లామ్‌లను గెలుచుకుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను సొంతం చేసుకున్న ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకోవడమంటే సంచలనమని చెప్పాలి. దాదాపు 44 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, 41 ఏళ్ల తర్వాత వింబుల్డన్ గెలిచిన ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా ఆష్లే రికార్డు సృష్టించింది.

"ఇలాంటి కఠిన నిర్ణయం ఎలా వెల్లడించాలో అర్థం కావడం లేదు. టెన్నిస్‌కు వీడ్కోలు చెబుతున్నా. అయితే నేను సంతోషంగానే ఉన్నా. అదేవిధంగా దేనికైనా సిద్ధంగా ఉన్నా. సూపర్ గేమ్‌ కోసం నా వంతు కృషి చేశాను. అందుకు ఎంతో ఆనందంగా ఉంది. నా వరకైతే విజయవంతంగా ముగించాను. ఈ సందర్భంగా నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రిటైర్‌మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నా. మిగిలిన కలలను నెరవేర్చుకోవడంపై దృష్టిసారిస్తా" అని బార్టీ పేర్కొంది. ప్రపంచ టెన్నిస్‌ సంఘం స్పందిస్తూ.. ‘ప్రతి యువ టెన్నిస్‌ క్రీడాకారిణికి స్ఫూర్తిగా నిలుస్తావు. ఆట పట్ల నీకున్న ప్రేమ అమోఘం. ఆన్‌-కోర్టు, ఆఫ్‌-కోర్టులో నీదైన మార్క్‌ను ప్రదర్శించావు" అని పోస్టు చేసింది.

మహిళల విభాగంలో నంబర్‌ వన్‌గా అత్యధిక ఎక్కువ రోజులు ఉన్న నాలుగో ప్లేయర్‌గా బార్టీ రికార్డు అందుకుంది. ప్రస్తుతం 121 వారాల నుంచి ఆమె టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతోంది. స్టెఫీ గ్రాఫ్ (186 వారాలు), సెరెనా విలియమ్స్ (186 వారాలు), మార్టినా నవత్రిలోవా (156 వారాలు) ముందు వరుసలో ఉన్నారు. బార్టీ రిటైర్‌మెంట్ ప్రకటించడంపై క్రీడా ప్రపంచం స్పందించింది. తమతో ఆడిన సందర్భాలను మహిళా ప్లేయర్లు గుర్తుకు తెచ్చుకున్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. భవిష్యత్తులో అన్నీ శుభాలే జరగాలని ఆకాంక్షించారు.

ఇదీ చదవండి: స్టీవ్‌ స్మిత్ రికార్డు.. సంగక్కర, సచిన్​ను అధిగమించి..

Last Updated :Mar 23, 2022, 10:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.