Pranav Anand GM : భారత 76వ గ్రాండ్​మాస్టర్​గా ప్రణవ్​ ఆనంద్​

author img

By

Published : Sep 16, 2022, 12:21 PM IST

Updated : Sep 16, 2022, 12:58 PM IST

pranav anand

దేశ చదరంగంలో మరో ఆణిముత్యం గ్రాండ్​ మాస్టర్​ హోదా సాధించాడు. ప్రస్తుతం మయామీలో జరుగుతున్న వరల్డ్​ చెస్​ ఛాంపియన్​షిప్​లో 2500 ఎలో రేటింగ్ పాయింట్లు దాటి ఈ ఘనత సాధించాడు.

Pranav Anand GM : దేశ చదరంగంలో మరో గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం) అవతరించాడు. బెంగళూరుకు చెందిన 15 ఏళ్ల ప్రణవ్ ఆనంద్ భారత 76వ గ్రాండ్ మాస్టర్​గా నిలిచాడు. గ్రాండ్ మాస్టర్​ హోదా సాధించాలంటే 2500 ఎలో రేటింగ్ పాయింట్లను దాటాలి. ప్రస్తుతం రొమేనియాలోని మమాయలో జరుగుతున్న వరల్డ్​ యూత్​ చెస్ ఛాంపియన్​షిప్​లో 2500 ఎలో రేటింగ్‌ పాయింట్లు దాటి ప్రణవ్​ గురువారం ఈ ఘనత సాధించాడు. ​

జులైలో స్విట్జర్లాండ్​లో జరిగిన బియెల్ చెస్ ఫెస్టివల్​లో మూడో, తుది గ్రాండ్​ మాస్టర్​ నార్మ్‌ల పాయింట్లను స్కోర్ చేశాడు. స్పెయిన్​కు చెందిన ఆటగాడు ఎడుర్డో ఇతుర్రిజాగా బొనెల్లితో (2619) జరిగిన మ్యాచ్​లో గెలిచి ఈ స్కోర్ చేశాడు.
అదే ఈవెంట్​లో ఫ్రాన్స్​కు చెందిన లగార్డే మాక్సిమ్(2631), సేతురామన్ ఎస్​పీపై (2623) గెలిచాడు. ఆర్యన్ చోప్రా(2610), ఆర్మేనియా ఆటగాడు షంత్ సర్గ్​స్యన్​తో (2661) మ్యాచ్​ డ్రాగా ముగించాడు. మొదటి జీఎం నార్మ్​లను 2022 జనవరిలో జరిగిన సిట్​గెస్ ఓపెన్​లో, 2022 మార్చ్​లో జరిగిన మరో టోర్నమెంట్​లో పూర్తి చేశాడు.

"అతడికి చెస్​ అంటే చాలా ప్యాషన్. అందులో చాలా ఇంట్రెస్ట్​ చూపిస్తాడు. దాని కోసం ఎంత సమయమైనా కేటాయిస్తాడు. అతడు గేమ్స్​లో కచ్చితమైన గణాంకాలను రూపొందించుకోవడంలో, తుది ఆటల్లో చాలా బాగా ఆడతాడు. ఈ రెండూ అతడి బలాలు. ఆనంద్​ ఈ ఘనత సాధించడానికి మరో కారణం అతడి తల్లిదండ్రులు. వాళ్లు పట్టుదలతో చాలా సమయం అతిడిపై కేటాయించి సపోర్ట్ చేశారు. కరోనా కనుక లేకపోతే ప్రణవ్​ సంవత్సరం ముందే గ్రాండ్​ మాస్టర్​ అయ్యేవాడు. నేను ఇప్పటివరకు చూసిన వాళ్లలో ఇతడు చాలా టాలెంటెడ్​ బాలుడు" అని ఆనంద్ కోచ్​ వి శరవణన్​ చెప్పాడు.

ఇవీ చదవండి: జడేజా కోసం ఈ యువ క్రికెటర్ ఏం చేశాడో తెలుసా?

బాల్​బాయ్​గా మొదలుపెట్టి.. దిగ్గజ ప్లేయర్​గా ఎదిగి.. ఫెదరర్ విజయ ప్రస్థానం

Last Updated :Sep 16, 2022, 12:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.