ETV Bharat / sports

ఒలింపిక్స్​కు మరో నలుగురు భారత అథ్లెట్లు

author img

By

Published : Mar 19, 2021, 4:20 PM IST

Olympics: Kamal, Sathiyan, Manika, Sutirtha book their tickets to Tokyo
టోక్యో ఒలింపిక్స్​కు మరో నలుగురు భారత అథ్లెట్లు

మరో నలుగురు భారత అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించారు. టేబుల్​ టెన్నిస్​ విభాగం నుంచి శరత్​ కమల్, జ్ఞానశేఖరన్​ సాథియన్, సుతీర్థ ముఖర్జీ, మనికా బాత్ర ఈ మెగా టోర్నీకి క్వాలిఫై అయ్యారు.

ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్​కు.. మరో నలుగురు భారత అథ్లెట్లు అర్హత సాధించారు. దోహా వేదికగా జరుగుతున్న ఆసియా ఒలింపిక్ క్వాలిఫికేషన్​ టోర్నీలో ఆడుతున్న టేబుల్​ టెన్నిస్ ఆటగాళ్లు.. శరత్​ కమల్​, జ్ఞానశేఖరన్​ సాథియన్​, సుతీర్థ ముఖర్జీ, మనికా బాత్ర ఒలింపిక్స్​కు క్వాలిఫై అయ్యారు.

గ్రూప్​లో అత్యధిక విజయాలతో సాథియన్​, ముఖర్జీ ఈ మెగా ఈవెంట్​లో స్థానాలను పొందగా.. కమల్​, బాత్ర మాత్రం తమ అత్యుత్తమ ర్యాంకుల ఆధారంగా ఒలింపిక్ బెర్తులను దక్కించుకున్నారు.

శరత్​ నాలుగో సారి..

తాజాగా టోక్యో ఒలింపిక్స్​కు క్వాలిఫై అయిన శరత్​ కమల్​కు ఈ మెగా టోర్నీలో పాల్గొనడం నాలుగో సారి. గతంలో 2004, 2008, 2016లో ప్రతిష్టాత్మక ఆటలకు శరత్​ అర్హత పొందాడు.

​నాలుగో సారి ఒలింపిక్స్​కు వెళ్లనుండటంపై క్రీడల మంత్రి కిరణ్​ రిజిజు స్పందించారు. ఇది దేశానికి గర్వకారణమైన విషయమని అభినందించారు.

అభినందనల వెల్లువ..

ఒలింపిక్స్​కు అర్హత పొందిన ఈ నలుగురు అథ్లెట్లకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. టేబుల్ టెన్నిస్​ సింగిల్స్ విభాగంలో ఒలింపిక్స్​కు క్వాలిఫై అయిన సుతీర్థ ముఖర్జీతో పాటు సాథియన్​కు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్​) తన అధికారిక ట్విట్టర్​ వేదికగా అభినందనలు తెలిపింది. పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రతిష్టాత్మక టోర్నీకి క్వాలిఫై అయిన సాథియన్, మనికా బాత్రకు క్రీడల మంత్రి కిరణ్ రిజిజు శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చదవండి: దిల్లీ క్యాపిటల్స్​​ కొత్త జెర్సీ ఇదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.