ETV Bharat / sports

ఆ స్కూల్​ విద్యార్థులకు నీరజ్​ చోప్రా స్పెషల్ క్లాస్​!

author img

By

Published : Dec 2, 2021, 5:46 PM IST

Neeraj Chopra news
నీరజ్ చోప్రా అప్​డేట్స్

Neeraj Chopra news: పిల్లల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాడు ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా. డిసెంబర్​ 4న అహ్మదాబాద్​లోని సంస్కార్​ధామ్​ పాఠశాల ఇందుకు వేదికవనుంది. ఈ మేరకు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్​ ఠాకూర్​ ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు.

Neeraj Chopra campaign: దేశవ్యాప్తంగా ఫిట్​నెస్​, డైట్​పై అవగాహన కల్పించడానికి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాడు ఒలింపిక్​ విజేత నీరజ్​ చోప్రా. గుజరాత్​ అహ్మదాబాద్​లోని సంస్కార్​ధామ్​ పాఠశాలలో డిసెంబర్​ 4న పిల్లలతో కలిసి ముచ్చటించనున్నాడు. ఈ మేరకు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్​ ఠాకూర్​ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

'ఒలింపిక్, పారాలింపిక్​​ విజేతలు.. ఫిట్​నెస్​, డైట్​, క్రీడలకు సంబంధించిన అంశాలపై పిల్లల్లో అవగాహన కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. డిసెంబర్​ 4న సంస్కార్​ధామ్​ పాఠశాలలో ఈ మిషన్​ను నీరజ్​ చోప్రా ప్రారంభిస్తాడు.' అని అనురాగ్​ ఠాకూర్​ పేర్కొన్నారు.

'ప్రధాని మోదీ పిలుపునిచ్చిన మిషన్​లో భాగమవనున్నందుకు ఆనందంగా ఉంది. యువత ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగించేందుకు ఈ పర్యటన ఎంతో ఉపయోగపడుతుంది.' అని నీరజ్ తెలిపాడు.

విద్యా శాఖ, క్రీడా మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించే ఈ ప్రత్యేక ప్రచారంలో టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్ క్రీడాకారులు పాల్గొంటారు. ప్రచారంలో 2 ఏళ్ల కాలవ్యవధిలో దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలను సందర్శిస్తారు.

ఇదీ చదవండి:BWF World Tour Finals: సెమీస్​కు పీవీ సింధు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.