ETV Bharat / sports

'రజతం సంతృప్తిని ఇవ్వలేదు.. స్వర్ణం కోసం సిద్ధమవుతా'

author img

By

Published : Aug 6, 2021, 5:21 AM IST

Ravi Dahiya
రవికుమార్‌ దహియా

తాను రజతం కోసం టోక్యోకు రాలేదని, ఇది తనకు సంతృప్తిని ఇవ్వలేదని భారత రెజ్లర్‌ రవికుమార్‌ దహియా తెలిపాడు. 2024 ప్యారిస్ ఒలింపిక్స్​లో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగుతానని పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. ఈ రోజు ఉగెవ్‌ జవుర్‌ సమర్థమైన రెజ్లర్ అని తెలిపాడు.

ఈ సారికి రజతం మాత్రమే దక్కింది.. కానీ పోరాటం ఆగదని భారత రెజ్లర్‌ రవికుమార్‌ తెలిపాడు. 2024 ప్యారిస్​ ఒలింపిక్స్​లో స్వర్ణమే లక్ష్యంగా పోరాడతానని పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు.

" నేను రజతం కోసం టోక్యోకు రాలేదు. ఇది నాకు సంతృప్తిని ఇవ్వలేదు. కానీ ఈసారి నాకు రజతమే దక్కింది.. ఎందుకంటే ఉగెవ్‌ జవుర్‌ ఈరోజు సమర్థమైన రెజ్లర్​. అయితే నేను అనుకున్నది మాత్రం సాధించలేదు. నేను సిల్వర్ పతకంతోనే ఆగిపోను. వచ్చే ఒలింపిక్స్​లో సమర్థవంతంగా, దృఢంగా సిద్ధమవుతా"

-- రవికుమార్‌ దహియా, భారత రెజ్లర్‌

'ఉగెవ్‌ జవుర్‌ రెజ్లింగ్ స్టైల్ బాగుంది. నేను నా ఆట ఆడేందుకు వీలు లేకుండా పోయింది. నేను ఎలా ఆడానో నాకే తెలియదు. అతను చాలా స్మార్ట్​గా రెజ్లింగ్ ఆడాడు.. 'అని దహియా చెప్పుకొచ్చాడు.

"దహియా ముందు నుంచి ఆడుతున్నాడని.. పక్కనుంచి కూడా ఆడాలని టోక్యోలోని కోచ్​లు చెప్తే బాగుండేదని దహియా కోచ్ మహాబలి సత్పాల్ స్పష్టం చేశాడు. రవి.. రష్యన్ రెజ్లర్ కంటే సమర్థుడు. గోల్డ్ పతకం కొట్టేందుకు సువర్ణావకాశం వచ్చింది."

-- మహాబలి సత్పల్, దహియా చిన్ననాటి కోచ్

సత్పల్.. రవి దహియా 12ఏళ్లు ఉన్నప్పటి నుంచి రెజ్లింగ్​లో శిక్షణ అందిస్తున్నాడు.

టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్‌ రవి కుమార్‌ పసిడి కల నెరవేరలేదు. సుశీల్‌ కుమార్‌ తర్వాత ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌లో ఫైనల్‌కు చేరిన కుస్తీ వీరుడిగా ఖ్యాతి గడించిన రవికుమార్‌ తుదిపోరులో మాత్రం పరాజయం చవిచూశాడు. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌, రష్యా రెజ్లర్​ ఉగెవ్‌ జవుర్‌ 7-4 తేడాతో రవికుమార్‌పై విజయం సాధించాడు.

ఇవీ చదవండి:

Ravi Kumar Dahiya: కష్టాల కడలిని దాటి పసిడిపై కన్నేసి!

Olympics: భారత్​కు మరో పతకం.. రెజ్లర్​ రవి దహియాకు రజతం

రవి దహియాకు ప్రశంసల వెల్లువ.. మోదీ ఫోన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.