ETV Bharat / sports

వారెవ్వా అర్జెంటీనా.. మూడో సారి.. మూడో స్థానం.. మూడో జట్టు.. పాపం ఫ్రాన్స్​!

author img

By

Published : Dec 19, 2022, 10:07 AM IST

argentina
అర్జెంటీనా

ఉత్కంఠభరితంగా సాగిన ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్​ పోరులో అర్జెంటీనా 4-2 తేడాతో పైచేయి సాధించి విశ్వ విజేతగా అవతరించింది. దీంతో ఆ దేశం ఎన్నో రికార్డులను సాధించింది. ప్రస్తుతం అర్జెంటీనా సంబరాల్లో మునిగితేలుతోంది.

FIFA World Cup 2022 Argentina : ఫుట్​బాల్​ ప్రపంచకప్‌ గెలవాలన్న అర్జెంటీనా 36 ఏళ్ల నిరీక్షణకు ఆదివారం తెరపడింది. ఖతార్‌ వేదికగా ఫ్రాన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో మెస్సీ సేన విజయం సాధించడంతో కల సాకారమైంది. ఫుట్​బాల్​ హీరో మెస్సీకి ఘనమైన వీడ్కోలు లభించడంతో పాటు అర్జెంటీనా మూడోసారి ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది. 4-2తో అర్జెంటీనా పైచేయి సాధించి విశ్వ విజేతగా అవతరించింది. మరి ఈ మ్యాచ్‌ ద్వారా అర్జెంటీనా ఎన్నో రికార్డులను సాధించింది.

మూడో సారి
ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టైటిల్‌ సాధించడం అర్జెంటీనాకిది మూడోసారి. గతంలో ఆ జట్టు 1978, 1986లలో సాధించింది.

మూడో స్థానం
ప్రపంచకప్‌ను అత్యధిక సార్లు గెలిచిన జట్ల జాబితాలో అర్జెంటీనా మూడో స్థానానికి చేరుకుంది. బ్రెజిల్‌ (5 సార్లు) టాప్‌ ర్యాంక్‌లో, జర్మనీ (4 సార్లు), ఇటలీ (4 సార్లు) సంయుక్తంగా రెండో ర్యాంక్‌లో ఉన్నాయి.

మూడో జట్టు
'షూటౌట్‌' ద్వారా ప్రపంచకప్‌ నెగ్గిన మూడో జట్టు అర్జెంటీనా. గతంలో బ్రెజిల్‌ (1994లో), ఇటలీ (2006లో) ఈ ఘనత సాధించాయి. అత్యధికంగా ఆరుసార్లు ప్రపంచకప్‌లో 'షూటౌట్‌'లలో మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా అర్జెంటీనా గుర్తింపు పొందింది.

పాపం ఫ్రాన్స్‌
డిఫెండింగ్‌ చాంపియన్‌ తదుపరి టోర్నీ ఫైనల్లో ఓడిపోవడం ఇది మూడోసారి. గతంలో అర్జెంటీనా (1990లో), బ్రెజిల్‌ (1998లో) జట్లకు ఇలాంటి ఫలితమే ఎదురైంది. ఇప్పుడు ఫ్రాన్స్‌ వంతు!

అంబరాన్నంటిన సంబరాలు
గాలి స్తంభించేలా.. కాలం ఆగేలా.. విశ్వమే బంతిగా మారి.. అతని కాలు కింద వాలిందేమో అనేలా.. షూటౌట్‌తో కలిపి మూడుసార్లు బంతిని నెట్‌లోకి పంపించాడు మెస్సి. ఈ ఉత్కంఠభరిత పోరు ముగియగానే రెప్ప వేయడం మర్చిపోయిన అభిమానుల కళ్లు చెమర్చాయి. ఊపిరి తీసుకోవడం ఆగిపోయినట్లు కనిపించిన మనసులు.. భావోద్వేగంతో కేకలు పెట్టాయి. మెస్సి సాధించాడు. తనకు చివరిదైన అయిదో ప్రపంచకప్‌లో లక్ష్యాన్ని చేరుకున్నాడు. దిక్కులు పిక్కటిల్లేలా సంబరాలే సంబరాలు!

డ్రెస్సింగ్‌ రూమ్‌లో గెలుపు సంబరాలు.. వీడియో
అర్జెంటీనా మూడున్నర దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. సూపర్‌స్టార్‌ మెస్సి స్వప్నం సాకారమైంది. అనేక మలుపులతో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడిస్తూ అర్జెంటీనా ఫిఫా ప్రపంచకప్‌ విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో అర్జెంటీనా డ్రెస్సింగ్‌ రూమ్‌లో జట్టు సభ్యులు సంబరాలు చేసుకున్నారు. ఆ వీడియో మీరూ చూడండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.