ETV Bharat / sports

Indian Chess League: వచ్చే జూన్‌లో ఇండియన్‌ చెస్‌ లీగ్‌

author img

By

Published : Dec 15, 2021, 6:31 AM IST

Indian Chess League: వచ్చే ఏడాది జూన్​లో ఇండియన్ చెస్ లీగ్​ ప్రారంభం కాబోతున్నట్లు అఖిల భారత చెస్ సమాఖ్య వెల్లడించింది. ఈ లీగ్ ద్వారా భారత చెస్ ముఖచిత్రం మారబోతుందని ఏఐసీఎఫ్ అధ్యక్షుడు సంజయ్ కపూర్ తెలిపారు.

Indian Chess League in June, ఇండియా చెస్ లీగ్ జూన్​లో
Indian Chess League

Indian Chess League: వచ్చే ఏడాది జూన్‌లో ఇండియన్‌ చెస్‌ లీగ్‌ (ఐసీఎల్‌) ప్రారంభం కాబోతున్నట్లు అఖిల భారత చెస్‌ సమాఖ్య (ఏఐసీఎఫ్‌) మంగళవారం వెల్లడించింది. ఆరు ఫ్రాంఛైజీలతో నిర్వహిస్తున్న ఈ లీగ్‌లో ప్రతి జట్టులో ఇద్దరు సూపర్‌ గ్రాండ్‌మాస్టర్లు, ఇద్దరు భారత గ్రాండ్‌మాస్టర్లు, ఇద్దరు మహిళా గ్రాండ్‌మాస్టర్లు, భారత జూనియర్‌ బాలుడు, బాలిక ఉంటారు. డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో.. రెండు నగరాల్లో ఈ పోటీలు నిర్వహిస్తారు.

"త్వరలోనే మా కల తీరబోతోంది. ఇండియన్‌ చెస్‌ లీగ్‌ ద్వారా భారత చెస్‌ ముఖచిత్రం మారబోతోంది. చెస్‌లో మన జట్టు నంబర్‌వన్‌ కావడానికి ఈ లీగ్‌ దోహదం చేస్తుంది" అని ఏఐసీఎఫ్‌ అధ్యక్షుడు సంజయ్‌ కపూర్‌ చెప్పారు. ఫ్రాంఛైజీ యజమానికి ఉండాల్సిన అర్హతల గురించి త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని.. కార్పొరేట్‌ కంపెనీలు లీగ్‌కు మద్దతు ఇవ్వడానికి ముందుకొస్తున్నాయని ఏఐసీఎఫ్‌ కార్యదర్శి భరత్‌ సింగ్‌ తెలిపాడు.

ఇవీ చూడండి: IND vs SA 2021: వారి అహం క్రికెట్ కంటే గొప్పదా?.. అభిమానులు ఫైర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.