ETV Bharat / sports

Asia Cup Hockey: 16 గోల్స్‌తో భారత హాకీ జట్టు విధ్వంసం.. నాకౌట్​కు అర్హత

author img

By

Published : May 26, 2022, 8:37 PM IST

Asia Cup Hockey: ఆసియా కప్​​ నాకౌట్ దశకు భారత హాకీ జట్టు దూసుకెళ్లింది. గురువారం ఇండోనేషియాతో జరిగిన మ్యాచ్​లో 16-0 తేడాతో అద్భుత విజయం సాధించింది.

Asia Cup Hockey
Asia Cup Hockey

Asia Cup Hockey: ఆసియా కప్​లో అద్భుత ప్రదర్శనతో భారత హాకీ జట్టు నాకౌట్​ దశకు చేరింది. పూల్​-ఎలో చివరి మ్యాచ్​లో ఇండోనేసియాపై 16-0 తేడాతో విజయం సాధించింది. నాకౌట్​ దశకు అర్హత సాధించాలంటే ఇండోనేసియాపై 15 గోల్స్​ తేడాతో గెలవాల్సిన పరిస్థితిలో.. భారత పురుషుల హాకీ జట్టు 16 గోల్స్​ చేసి అద్భుతం చేసింది.

రెండో క్వార్టర్ ముగిసే సమయానికి ఇండోనేసియాపై 6-0తో ఆధిక్యం సంపాదించింది భారత్. ఆధిక్యం ఎక్కువగానే ఉన్నప్పటికీ టోర్నీ నుంచి నిష్క్రమణ తప్పదేమోనన్న అనుమానాలు మొదలయ్యాయి. కానీ భారత హాకీ ఆటగాళ్లు.. మిగిలిన రెండు క్వార్టర్స్​లో 10 గోల్స్​ చేసి సంచలన విజయం సాధించారు. భారత ఆటగాడు దిప్సన్ టిర్కీ 5 గోల్స్​తో అదరగొట్టాడు. ఈ విజయంతో జపాన్​తో పాటు భారత్ నాకౌట్​కు అర్హత సాధించింది. ఆసియా కప్​లో పాకిస్థాన్​తో జరిగిన తొలి మ్యాచ్​ను 1-1తో డ్రా చేసుకున్న భారత్, జపాన్ చేతిలో 2-5 తేడాతో ఓడిపోయింది.

ఇదీ చదవండి: మెల్ట్‌వాటర్‌ ఛాంపియన్స్‌ చెస్‌ ఫైనల్లో ప్రజ్ఞానంద హోరాహోరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.