ETV Bharat / sports

Dutee Chand Doping Test : డోపింగ్​ టెస్ట్​లో ఫెయిల్​.. ద్యుతీచంద్​పై నాలుగేళ్ల బ్యాన్​..

author img

By

Published : Aug 18, 2023, 2:32 PM IST

Updated : Aug 18, 2023, 4:56 PM IST

Dutee Chand Doping Test
ద్యుతీ చంద్​

Dutee Chand Doping Test : భారత ఫాస్టెస్ట్ స్ప్రింటర్‌ ద్యుతీచంద్‌పై యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ నాలుగేళ్ల నిషేధాన్ని విధించింది. గతేడాది డిసెంబర్​లో జరిపిన డోప్‌ టెస్టులో విఫలమైనందున ద్యుతీచంద్​పై నిషేధం విధిస్తున్నట్లు నాడా పేర్కొంది.

Dutee Chand Doping Test : భారత ఏస్ అథ్లెట్, 100 మీటర్ల రికార్డు హోల్డర్ ద్యుతీచంద్‌పై యాంటీ డోపింగ్‌ ప్యానెల్‌ నాలుగు సంవత్సరాల నిషేధం విధించింది. డోపింగ్​ పరీక్షల్లో ఫెయిలైనందుకుగాను ఆమెపై నిషేధం విధిస్తున్నట్లు జాతీయ డోపింగ్ నిరోధక ఏజెన్సీ (NADA) పేర్కొంది. నిషేధంలో ఉన్న 'సెలక్టివ్‌ ఆండ్రోజన్‌ రిసెప్టర్‌ మాడ్యులేటర్స్‌'ను ఆమె తీసుకున్నట్లు.. నాడా డిసెంబర్​లో నిర్వహించిన టెస్టులో తేలింది. కాగా ఈ నిషేధం ఈ ఏడాది జనవరి 3 నుంచి అమలులోకి వస్తుందని నాడా తెలిపింది.

దీంతో డిసెంబర్ 5 నుంచి ద్యుతీచంద్​ సాధించిన ఫలితాలు పరిగణలోకి రావని నాడా పేర్కొంది. అలాగే ద్యుతీ గెలిచిన పతకాలు, బహుమతులను నాడా స్వాధీనం చేసుకోనుంది. కాగా ఈ నిషేధంపై, అధికారికంగా లెటర్ అందుకున్న 21 రోజుల్లోపు తాను ఎదుర్కొంటున్న వేటుపై రివ్యూ పిటిషన్ వేసుకోవచ్చునని నాడా స్పష్టం చేసింది.
కాగా 2018లో జాతీయ అంతర్‌ రాష్ట్ర అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ (Inter State Championship) ఫైనల్స్​లో ద్యుతీచంద్.. 11.32 సెకన్లలో రేసును ముగించి గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు. కాగా 2020లో ద్యుతీచంద్​కు అర్జున అవార్డు లభించింది.

Dutee Chand Olympics 2016 : ఒడిశాకు చెందిన క్రీడాకారిని ద్యుతీ.. పరుగుల రాణి పీటీ ఉష తర్వాత భారత్​ నుంచి ఒలింపిక్స్​కు (2016) అర్హత సాధించిన తొలి అథ్లెట్​గా నిలిచారు. ఈమె కూడా ఇదే తొలి ఒలింపిక్స్.​ కానీ 100 మీటర్ల పోటీలో ఓటమి చవిచూశారు.

Dutee Chand Olympics 2021 : తర్వాత 2021 టోక్యో ఒలింపిక్స్​లోనూ పాల్గొన్న ద్యుతీ.. 100 మీటర్ల రేసులో మరోసారి విఫలమయ్యారు. ఆ పోటీల్లో హీచ్ 5 లో పాల్గొన్న ద్యుతీ.. 11.54 సెకన్లలో రేసును పూర్తి చేసి ఏడో స్థానానికి పరిమితమయ్యారు. అయితే ప్రతి హీట్​లో టాప్​-3 లో ఉన్నవారే సెమీఫైనల్స్​ పోరుకు అర్హత సాధిస్తారు.

Dutee Chand Relationship : గతంలో తనను తాను స్వలింగ సంపర్కురాలిగా ప్రకటించుకున్నారు ద్యుతీచంద్​. ఇలా స్వయంగా స్వలింగ సంపర్కురాలిగా చెప్పకున్న తొలి భారత అథ్లెట్​గా కూడా నిలిచారు. కాగా 2019లో తన ప్రియురాలు మోనాలీసాతో లివ్​ ఇన్ రిలేషన్​షిప్​లో ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రకటనతో కుటుంబం నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు అప్పట్లో ద్యుతీ తెలిపారు.

డోపింగ్​ పరీక్షలో ఫెయిల్​.. ద్యుతి చంద్​పై తాత్కాలిక నిషేధం

Olympics: సోషల్​మీడియా వల్ల అథ్లెట్లపై మానసిక ఒత్తిడి?

Last Updated :Aug 18, 2023, 4:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.