ETV Bharat / sports

'ఒలింపిక్స్ జరిగితే కరోనాను జయించినట్టే'

author img

By

Published : May 15, 2021, 6:50 PM IST

ఒలింపిక్స్​ నిర్వహణ గురించి​ భారత ఒలింపిక్​ సంఘం అధ్యక్షుడు నరీందర్ బత్రా స్పందించారు. క్రీడలు జరిగితే కరోనాను జయించనట్లు బలమైన సందేశం ప్రజల్లోకి వెళ్తుందని అన్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పోటీలు జరుగుతాయా లేదా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

batra
బత్రా

ఒలింపిక్స్​ను చెప్పిన తేదీల్లో జరిపితే కరోనాను అధిగమించినట్లు ఓ బలమైన సందేశం ఇచ్చినట్లవుతుందని ఐఓఏ అధ్యక్షుడు నరీందర్​ బత్రా అన్నారు. కొవిడ్ వల్ల ఇప్పటికే ఏడాది వాయిదా పడ్డ ఈ మెగా క్రీడలు.. షెడ్యూల్​ ప్రకారం ఈ ఏడాది జులై 23నుంచి జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మెగా ఈవెంట్​ను రద్దు చేయాలంటూ 3.5 లక్షల సంతకాలతో ఓ ఆన్​లైన్ పిటిషన్​ను టోక్యో ప్రభుత్వానికి ఒలింపిక్స్ వ్యతిరేక ఆందోళనకారులు శుక్రవారం సమర్పించారు. ఈ నేపథ్యంలోనే బత్రా ఈ వ్యాఖ్యలు చేశారు.

"జీవితం ముందుకు సాగిపోవాలి. ఒలింపిక్స్ నిర్వహిస్తే కొవిడ్​ను జయించినట్లు ఓ బలమైన సందేశాన్ని ప్రజలకు ఇచ్చినట్లవుతుంది. ఆటలపై వ్యతిరేకత ఎప్పుడూ ఉంటుంది. కానీ ఈ మెగాక్రీడల నిర్వహణ గురించి నిర్వాహకుల కమిటీ, ఐఓసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కరోనా పట్లు భారత అథ్లెట్లు తగిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నారు. ఒలింపిక్స్​లో తమ వంతుగా ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు"

-నరీందర్​ బత్రా, ఐఓఏ అధ్యక్షుడు.

జపాన్​ ప్రభుత్వం 153 దేశాల నుంచి తమ దేశానికి వచ్చే విమాన సేవలను రద్దు చేసింది. ఇందులో భారత్​ కూడా ఉంది. అయితే ఒలింపిక్స్​లో పాల్గొనే మన అథ్లెట్స్​కు ఇది సమస్య కాదని హామీ ఇచ్చారు బత్రా. అథ్లెట్స్ ప్రత్యేక విమానం ద్వారా​ ఆ దేశానికి ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. దీనిపై చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఐఓసీ, నిర్వాహకుల కమిటీ నిబంధనల ప్రకారం అన్ని ప్రొటోకాల్స్​ను అథ్లెట్స్​ పాటిస్తున్నారని, వ్యాక్సినేషన్​ కూడా వేయించుకుంటున్నారని చెప్పారు.

ఇదీ చూడండి: ఒలింపిక్స్ రద్దు చేయాలని పిటిషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.