ETV Bharat / sports

Ballon D'Or Award Messi : బెస్ట్​ ఫుట్‌బాలర్​గా మెస్సీకి ప్రతిష్టాత్మక అవార్డ్​.. రికార్డ్​ స్థాయిలో ఏకంగా 8వ సారి

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 31, 2023, 7:10 AM IST

Updated : Oct 31, 2023, 8:06 AM IST

Ballon D'Or Award Messi : అర్జెంటీనా ఫుట్‌బాల్‌ ప్లేయర్​ లియోనల్‌ మెస్సీకి మరోసారి అరుదైన గౌరవం దక్కింది. ఆ వివరాలు..

Ballon D'Or Award Messi : ఫుట్‌బాల్‌ స్టార్‌ మెస్సీకి ప్రతిష్టాత్మక అవార్డ్​.. రికార్డ్​ స్థాయిలో ఏకంగా 8వ సారి
Ballon D'Or Award Messi : ఫుట్‌బాల్‌ స్టార్‌ మెస్సీకి ప్రతిష్టాత్మక అవార్డ్​.. రికార్డ్​ స్థాయిలో ఏకంగా 8వ సారి

Ballon D'Or Award Messi : గతేడాది తన వరల్డ్ కప్ కలను నెరవేర్చుకున్న అర్జెంటీనా స్టార్, దిగ్గజ ఫుట్​బాల్ ప్లేయర్​​​ లియోనెల్ మెస్సీకి మరోసారి ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. అతడు బాలన్‌ డి ఓర్‌ అవార్డును ముద్దాడాడు. 2022-23 గానూ ఉత్తమ ప్రదర్శన చేయడం, ఖతర్‌ వేదికగా జరిగిన ఫుట్‌బాల్‌ వరల్డ్ కప్​లో తన జట్టును గెలిపించిన తీరుకు.. మెస్సీకి ఈ అవార్డును అందజేశారు. సోమవారం(అక్టోబర్ 30) రాత్రి పారిస్​లోని థియేటర్ డు షాటలెట్​లో జరిగిన సెర్మనీలో మెస్సీ ఈ పురస్కారాన్ని అందుకున్నాడు. దీంతో మెస్సీ.. అత్యధికంగా 8 సార్లు ఈ అవార్డును అందుకున్న ఆటగాడిగానూ రికార్డు క్రియేట్ చేశాడు. ఇంగ్లాండ్​ మాజీ ప్లేయర్ డేవిడ్ బెక్‌హామ్ చేతుల మీదుగా దీనిని తీసుకున్నాడు.

ఫ్రెంచ్ స్టార్ ప్లేయర్ ఎంబాపై, మాంచెస్టర్ సిటీ ప్లేయర్ ఎర్లింగ్ హాలాండ్​లను వెనక్కి నెట్టి మెస్సీ ఈ బాలన్‌ డి ఓర్‌ అవార్డును ఖాతాలో వేసుకున్నాడు మెస్సీ. ఈ పురస్కారం అర్జెంటీనా టీమ్ మొత్తానికి.. తన బహుమానం అని చెప్పుకొచ్చాడు. సోమవారం అర్జెంటీనా దివంగత స్టార్ ప్లేయర్ మారడోనా 63వ జయంతి. ఈ సందర్భంగా మారడోనాకు మెస్సీ ఈ అవార్డును అంకితమిచ్చాడు.

కాగా, ఈ మధ్యే బాలన్‌ డి ఓర్‌ అవార్డు నిబంధనల్లో మార్పులు చేశారు. దీంతో మెస్సీకి కలిసి వచ్చింది. పూర్తి కేలండర్ ఇయర్ కాకుండా గత సీజన్​లో ప్లేయర్ల్​ రికార్డులు, ప్రదర్శన చూసి పురస్కారాన్ని అందజేయాలని నిర్ణయించారు. అలా మెస్సీకి ఈ అవార్డు వరించింది. తొలి సారి 2009లో అతడు ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నాడు.


Ballon D'Or Award Messi Vs Ronaldo : పారిస్‌ వేదికగా ఈ అవార్డు ప్రదానోత్సవం గ్రాండ్​గా జరిగింది. ఇకపోతే అత్యధికంగా బాలన్‌ డి ఓర్‌ అవార్డును దక్కించుకున్న వారిలో క్రిస్టియానో రొనాల్డో(5) రెండో స్థానంలో ఉన్నాడు. మహిళల విభాగంలో స్పెయిన్‌, మార్సిలోనా జట్టు మిడ్‌ఫీల్డర్‌ ఐతన బొన్‌మాటి మొదటి సారిగా బాలన్‌ డి ఓర్‌ అవార్డును ముద్దాడింది. ఈమె 2023 మహిళల ఫుట్‌బాల్‌ వరల్డ్ కప్​లో విజేతగా నిలిచిన స్పెయిన్‌ జట్టులో సభ్యురాలు.

'బంగారు ఐఫోన్లు'.. టీమ్​ సభ్యులకు మెస్సి స్పెషల్​ గిఫ్ట్​లు.. అదిరిపోయాయిగా!

FIFA Friendly Match 2023 : రెండు నిమిషాల్లో గోల్.. షాక్‌లో మెస్సీ ఫ్యాన్స్!

Last Updated : Oct 31, 2023, 8:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.