ETV Bharat / sports

Tokyo Olympics: స్క్వాడ్లను ప్రకటించిన హాకీ ఇండియా

author img

By

Published : Jun 18, 2021, 9:56 PM IST

టోక్యో ఒలింపిక్స్​ (Tokyo Olympics)లో పాల్గొననున్న హాకీ జట్లను ప్రకటించింది హాకీ ఇండియా(Hockey India). పురుషుల, మహిళల విభాగంలో 16 మందితో కూడిన స్క్వాడ్లను వెల్లడించింది.

hockey india, tokyo olympics
హాకీ ఇండియా, టోక్యో ఒలింపిక్స్

టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics)​లో పాల్గొననున్న పురుషుల, మహిళల జట్లను ప్రకటించింది హాకీ ఇండియా(Hockey India). పురుషుల జట్టులో పది మంది ఆటగాళ్లు తొలిసారి ఒలింపిక్స్​లో ఆడనుండగా.. మహిళల టీమ్​లో ఈ సంఖ్య ఎనిమిదిగా ఉంది. రెండు జట్లలోనూ మొత్తం 16 మందితో కూడిన స్క్వాడ్లను వెల్లడించింది.

అమిత్, హర్దిక్, వివేక్, నీలకంఠ శర్మ, సుమిత్, షంషేర్​ సింగ్, దిల్​ప్రీత్ సింగ్, గుర్జంత్ సింగ్, లలిత్ కుమార్.. తొలిసారి ప్రతిష్ఠాత్మక ఈవెంట్లో బరిలోకి దిగబోతున్నారు. గాయం కారణంగా 2016 రియో డి జనీరియో ఒలింపిక్స్​కు దూరమైన డిఫెండర్​ బిరేంద్ర లక్రా.. తాజా ఈవెంట్​ కోసం తిరిగి జట్టుతో కలిశాడు.

ఇక 1980, 2016 ఒలింపిక్స్​లో బరిలోకి దిగిన మహిళల హాకీ జట్టు మొత్తంగా మూడో సారి.. వరుసగా రెండో సారి మెగా ఈవెంట్​లో పాల్గొననుంది. ప్రస్తుత టోక్యో ఒలింపిక్స్​ జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు నిర్వహించనున్నారు.

పురుషుల జట్టు:

గోల్​ కీపర్..

పీఆర్ శ్రీజేష్​(కెప్టెన్).

డిఫెండర్లు..

హర్మన్​ప్రీత్​ సింగ్​, రూపిందర్​ పాల్ సింగ్, సురేందర్ కుమార్, అమిత్ రోహిదాస్, బిరేంద్ర లక్రా.

మిడ్​ ఫీల్డర్లు..

హర్దిక్ సింగ్, మన్​ప్రీత్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, నీలకంఠ శర్మ, సుమిత్.

ఫార్వర్డ్స్​..

షంషేర్ సింగ్, దిల్​ప్రీత్ సింగ్, గుర్జంత్​ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ, మన్​దీప్​ సింగ్.

మహిళల జట్టు:

గోల్ కీపర్..

సవిత.

డిఫెండర్లు..

దీప్​ గ్రేస్​ ఎక్కా, నిక్కి ప్రధాన్, గుర్జిత్​ కౌర్, ఉదిత.

మిడ్ ఫీల్డర్లు..

నిషా, నేహా, సుశీలా చాను పుఖ్రాంబం, మోనికా, నవ్​జోత్​ కౌర్​, సలీమా టేటే.

ఫార్వర్డ్స్​..

రాణి రాంపాల్, నవ్​నీత్​ కౌర్, లాల్​రీమ్ సైమి, నందన కఠారియా, షర్మిలా దేవి.

ఇదీ చదవండి: క్షీణించిన మిల్కా సింగ్ ఆరోగ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.