ETV Bharat / sports

'అతడు స్పెషల్​ కేటగిరీ ఆటగాడు'.. రహానేపై మాజీల ప్రశంసల వర్షం

author img

By

Published : Jun 13, 2023, 9:09 PM IST

Updated : Jun 13, 2023, 9:22 PM IST

WTC Final 2023 Rahane Innings : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (డబ్ల్యూటీసీ)లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన రహానేపై మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు. ఒత్తిడి జయించి అతడు పరుగులు తీశాడని కొనియాడారు. రహానే ఇలాగే నిలకడగా ఆడాలన్నారు. ఇంకా ఏమన్నారంటే?

WTC Final 2023 Rahane Innings
WTC Final 2023 Rahane Innings

WTC Final 2023 Rahane Innings : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (డబ్ల్యూటీసీ ఫైనల్)లో టీమ్ఇండియా ఓడిపోయినప్పటికీ.. మిడిలార్డల్​ బ్యాటర్​ రహానే ఆడిన ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఐపీఎల్​లో చెన్నై సూపర్ కింగ్స్​ తరఫున అద్భుత ప్రదర్శన చేసిన రహానే.. డబ్ల్యూటీసీ ఫైనల్​ మ్యాచ్​లో తొలి ఇన్నింగ్స్‌లో 89 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 46 పరుగులు చేశాడు. టాప్ ఆర్డర్ త్వరగా పెవిలియన్ చేరితే, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇలాంటి అద్భుత ప్రదర్శన కనబర్చిన రహానేపై మాజీలు ప్రశంసల వర్షం కురిపించారు.
''రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రహానె ఆడిన తీరు అద్భుతం.. ఒత్తిడిని అధిగమించి పరుగులు చేయడం బాగుంది. పెద్ద లక్ష్యంలోనూ ఒత్తిడి లేకుండా ఆడేందుకు ప్రయత్నించాడు. క్రికెట్‌లో దూకుడు, సానుకూల దృక్పథంతో ఆతడు ఆడుతుంటే.. ప్రత్యేక ఆటగాడిగా కనిపిస్తున్నాడు. అతడు ఇలాగే నిలకడగా ఆడతాడని ఆశిస్తున్నాను" అని మాజీ క్రికెటర్​ జాఫర్ అన్నాడు.

మనం అలా చేసుంటే బాగుండేది : కీర్తి ఆజాద్
"ఆసీస్​ మనల్ని అన్ని విభాగాల్లో ఓడించింది. వారి బౌలింగ్, బ్యాటింగ్ సరైనది. మన బ్యాటింగ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో, ఆసీస్ బౌలర్లు పర్ఫెక్ట్ లెంత్​తో బౌలింగ్ చేశారు. వారు వికెట్లు తీయకపోయినా అదే లెంత్​కు కట్టుబడి ఉన్నారు. టీమ్ఇండియా ఓడిపోయింది మొదటి ఇన్నింగ్స్‌లోనే మ్యాచ్‌ ఓడిపోయింది. తొలి ఇన్నింగ్స్‌ కంటే రెండో ఇన్నింగ్స్‌లో మన బౌలింగ్‌ కాస్త మెరుగ్గా ఉంది. ఆసీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకే పరిమితం చేసి ఉంటే ఫలితం మనకు అనుకూలంగా ఉండేది. లోతైన బ్యాటింగ్ లైనప్ ఉంది, మనం అనవసరంగా వికెట్లు కోల్పోయాం" అని మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ అన్నారు.

ఆ విషయంలో రోహిత్​కు మద్దతిస్తున్నా : బ్రాడ్ హాగ్
"వరల్డ్​ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం మూడు టెస్టులు నిర్వహించాలన్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ సూచనకు నేను మద్దతు ఇస్తున్నా. కానీ ఈసారి ఫలితం కేవలం ఒక మ్యాచ్‌లో వచ్చింది. దీన్ని మనం ఏం చేయలేము. ఆసీస్ విజేతగా నిలిచింది. భవిష్యత్తులో, ఇలా మూడు మ్యాచ్​లు ఉంటే మంచిది. మూడు టెస్టుల సిరీస్.. అలాగే ఎనిమిది జట్లను రెండు విభాగాలుగా విభజిస్తే బాగుంటుంది. టాప్-4ని ఒక గ్రూప్‌గా.. మరో నాలుగు టీమ్​లను సెకండ్ గ్రూప్‌గా చేయాలి. అసోసియేట్ దేశాల్ని మరో డివిజన్‌గా చేసి ఆడించాలి. ఆయా విభాగాల్లో టాప్​లో ఉన్న జట్లు తమ స్వదేశంలో మూడు టెస్టుల సిరీస్ ఆడితే బాగుంటుంది'' అని ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ తన అభిప్రాయం వెల్లడించాడు.

Last Updated :Jun 13, 2023, 9:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.