ETV Bharat / sports

Women's IPL 2023: వేలానికి వేళాయే.. ఈ ప్లేయర్స్​పైనే అందరి ఫోకస్​!

author img

By

Published : Feb 13, 2023, 9:35 AM IST

Updated : Feb 13, 2023, 9:53 AM IST

క్రికెట్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆరంభ మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) వేలం మరి కొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఈ వేలం వివరాలు మీకోసం..

Women's IPL 2023
మహిళల ఐపీఎల్ వేలం 2023

బీసీసీఐ ఆధ్వర్యంలో తొలిసారి నిర్వహించనున్న మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టి20 టోర్నీ క్రికెటర్ల వేలం కార్యక్రమం మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు మొదలయ్యే అవకాశముంది. ఈ కార్యక్రమాన్ని స్పోర్ట్స్‌ 18 ఛానల్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ వేలం గురించి కొన్ని విశేషాలు మీకోసం..

  • ఈ మహిళా లీగ్‌ వేలం మల్లిక సాగర్‌ నేతృత్వంలో జరగనుండటం విశేషం. ఈమె 2021లో ప్రొ కబడ్డీ లీగ్‌ వేలం కార్యక్రమాన్ని నిర్వహించారు.
  • స్టార్‌ బ్యాటర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, యువ సంచలనం షెఫాలీ వర్మ వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. వీళ్లకు కోటి రూపాయలకు పైగా ధర పలుకుతుందని భావిస్తున్నారు.
  • వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిచా ఘోష్‌, సీమర్‌ రేణుక ఠాకుర్‌ కూడా ఆసక్తి రేపుతున్నారు. రాజేశ్వర్‌ గైక్వాడ్‌, రిచా యాదవ్‌, సీమర్లు మేఘన సింగ్‌, శిఖ పాండేల కోసం కూడా జట్లు గట్టిగా పోటీ పడే అవకాశముంది.
  • అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులోని సభ్యులు శ్వేత సెహ్రావత్‌, పర్శవి చోప్రా, మన్నత్‌ కశ్యప్‌, అర్చన దేవి, తితాస్‌ సాధు కూడా ఫ్రాంఛైజీలను ఆకర్షించవచ్చు.
  • అలీసా హేలీ, బేత్‌ మూనీ, ఎలిస్‌ పెర్రీ, మెగాన్‌ షట్‌ (ఆస్ట్రేలియా).. నాట్‌ సీవర్‌ (ఇంగ్లాండ్‌), డాటిన్‌ (వెస్టిండీస్‌) వంటి విదేశీ స్టార్లకు కూడా భారీ ధర పలుకుతుందని అంచనా.
  • ఐదు ఫ్రాంఛైజీలు ముంబయి ఇండియన్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌, ఆర్సీబీ, గుజరాత్‌ టైటాన్స్‌, యూపీ వారియర్స్‌ ఈ లీగ్​లో పాల్గొననున్నాయి.
  • మొత్తంగా 409 మందితో కూడిన క్రికెటర్ల జాబితాలో 90 మంది కోసం ఈ ఫ్రాంచైజీలు పోటీపడతాయి. ఈ ఆటగాళ్లలో 246 మంది భారత క్రికెటర్లు, 163 మంది విదేశీ క్రికెటర్లు వేలంలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
  • ప్రతి జట్టు గరిష్టంగా రూ.12 కోట్లు ఖర్చు చేయొచ్చు. ఆరుగురు విదేశీ ఆటగాళ్లు సహా 18 మందిని కొనుక్కోవచ్చు. కనీసం 15 మందిని తీసుకోవాలి.
  • క్రికెటర్ల కనీస ధర రూ.10 లక్షలతో మొదలవుతుంది. అత్యధిక కనీస ధర రూ.50 లక్షలు. వీటితో పాటు రూ.20 లక్షలు, రూ.30 లక్షలు, రూ.40 లక్షల విభాగాలు కూడా ఉన్నాయి.
  • ఇకపోతే ఈ డబ్ల్యూపీఎల్‌ మార్చి 4 నుంచి 26 వరకు ముంబయిలో జరగనుంది.

ఇదీ చూడండి: అద్భుతం.. ఇలాంటి క్యాచ్​ ఎప్పుడైనా చూశారా?

Last Updated :Feb 13, 2023, 9:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.